CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ఈడీ బిగ్ షాక్!

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ED) బిగ్ షాక్ ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసు(National Herald Case) చార్జ్ షీట్ (Charge Sheet)లో సీఎం రేవంత్ రెడ్డి పేరు చేర్చింది( Name Included). యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని చార్జ్ షీట్‌లో ఈడీ ఆరోపించింది. రేవంత్ రెడ్డితో పాటు, కాంగ్రెస్ నాయకుడు పవన్ బన్సల్, దివంగత నేత అహ్మద్ పటేల్ పేర్లను కూడా ఈడీ చార్జ్ షీట్‌లో చేర్చింది. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ (ఏజేఎల్) కు చెందిన రూ.2000 కోట్ల ఆస్తులను కాజేయడానికి కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ యంగ్ ఇండియా సంస్థను ఏర్పాటు చేశారని చార్జ్ షీట్ లో ఈడీ అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే.
యంగ్ ఇండియా సంస్థ ఏర్పాటుకు 2019–22 మధ్యలో విరాళాల రూపంలో డబ్బులు వసూలు చేసి, పదవులు ఇప్పిస్తామని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని చార్జ్ షీట్‌లో ఈడీ పేర్కొంది. సాక్షులను విచారించిన తర్వాతనే రేవంత్ రెడ్డి పేరును చార్జ్ షీట్‌లో చేర్చామని, విచారణలో రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకుల సూచన మేరకే విరాళాలు ఇచ్చామని సాక్షులు తెలియజేశారని ఈడీ స్పష్టం చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సీఎం రేవంత్ రెడ్డిపై అభియోగాలు మోపిన వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారే అవకాశం కనిపిస్తుంది. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ఆసరాగా చేసుకుని రేవంత్ రెడ్డిపై విమర్శల దాడికి పదును పెట్టనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.