ఏంటి.. గెట‌ప్ శీనుకి అన్ని కార్లు, బంగ్లాలు ఉన్నాయా.. తొలిసారి త‌న ఆస్తుల‌పై నోరు విప్పాడుగా…!

  • By: sn    breaking    Jan 17, 2024 10:05 AM IST
ఏంటి.. గెట‌ప్ శీనుకి అన్ని కార్లు, బంగ్లాలు ఉన్నాయా.. తొలిసారి త‌న ఆస్తుల‌పై నోరు విప్పాడుగా…!

బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ చాలా మందికి ఓ దారి చూపించింది. ఈ షో వ‌ల‌న లైఫ్‌లో సెటిల్ అయిన వారు చాలా మంది ఉన్నారు.నాగబాబు, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, మహేష్ ఆచంట, సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను… ఇంకా చాలా మంది జబర్దస్త్ వ‌ల‌న ఇప్పుడు ఓ స్థాయిలో ఉన్నారు. కొంద‌రు అయితే హీరోలుగా కూడా మారారు. ల‌గ్జ‌రీ కార్లు, విలాస‌వంత‌మైన ఇళ్లు కొనుక్కొని రాయ‌ల్ లైఫ్ అనుభ‌విస్తున్నారు. అయితే బుల్లితెర క‌మ‌ల్ హాస‌న్‌గా పేరుగాంచిన గెట‌ప్ శీను ఇప్పుడు టీవీ షోలు కాస్త త‌గ్గించి సినిమాల‌లో కీల‌క పాత్ర‌లు పోషిస్తూ అల‌రిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లై సూప‌ర్ హిట్ అయిన హనుమాన్ సినిమాలో కీలక పాత్రలో నటించి తన నటనతో మెప్పించారు.

గెటప్ శ్రీను యాక్టింగ్ స్కిల్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.. ఇప్పుడు రాజు యాదవ్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో గెటప్ శ్రీను హీరోగా నటిస్తున్నారు. మ‌రోవైపు చిరంజీవి సినిమాల‌లో ఎక్కువ అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్నాడు. గెట‌ప్ శీనులో మంచి స్కిల్స్ ఉండ‌డంతో ఆయ‌న‌కి అవ‌కాశాలు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. దీంతో ఆయ‌న కోట్ల రూపాయ‌లు వెన‌కేసుకొని ఉంటాడ‌ని చాలా మంది అనుకుంటున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో గెటప్ శ్రీను మాట్లాడుతూ తన ఆస్తుల గురించి క్లారిటీ ఇచ్చేశారు. జబర్దస్త్ వలన సెటిల్ అయిన మాట వాస్తవమే కాని నా ద‌గ్గ‌ర కోట్లు ఏమీ లేవు. ఇల్లు ఉంది దానికి ఈఎంఐ కట్టాలి. అలాగే కారు మీద కూడా ఈఎంఐ ఉంది. అలాగే నేను పెద్ద పెద్ద బంగ్లాను, బీఎండబ్ల్యు కార్లు కోరుకోను. ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి అని భావిస్తాను.

డబ్బు ఒత్తిడితో పని చేస్తే మంచి సినిమాలను ఎంచుకోలేమని గెటప్ శీను తెలియ‌జేశారు. ఇక రామ్ ప్రసాద్, సుధీర్ లను నేను మిస్ కానని గెటప్ శ్రీను అన్నారు. ఉదయాన్నే ప్రశాంతంగా లేచేలా జీవితం ఉండాలి. డబ్బు ఒత్తిడి ఉన్నప్పుడు ఏ సినిమా పడితే అది చేయాల్సి వస్తుంది. అప్పుడు క్రియేటివిటీ దెబ్బతింటుంది. ఒత్తిడి లేకపోతే సెలెక్టివ్ గా సినిమాలు చేస్తాను. వర్క్ సైడ్ డిస్ట్రబ్ కాదు, అని గెట‌ప్ శీను చెప్పుకొచ్చాడు. ఇప్పుడు హీరోగా ఆయ‌న చేస్తున్న సినిమా హిట్ అయితే కెరీర్ తిరుగుండ‌దు అని చెప్పాలి.