Ganja | 100 కిలోల గంజాయిని తిన్నగొర్రెలు.. ఆపై వింత ప్ర‌వ‌ర్త‌న‌

Ganja | 100 కిలోల గంజాయిని తిన్నగొర్రెలు.. ఆపై వింత ప్ర‌వ‌ర్త‌న‌

Ganja | ఆక‌లితో ఉన్న‌ గొర్రెలు.. దొరికిన మొక్క‌ల‌న్నింటిని తినేస్తుంటాయి. ఆ విధంగానే ఓ గంజాయి తోట‌లోకి ప్ర‌వేశించిన గొర్రెలు.. ఆ మొక్క‌ల‌న్నింటిని నిమిషాల్లో తినేశాయి. ఆ త‌ర్వాత వింత‌గా ప్ర‌వ‌ర్తించాయి. ఈ ఘ‌ట‌న గ్రీక్ ప‌ట్ట‌ణంలో వెలుగు చూసింది.

గ్రీన్, లిబియా, ట‌ర్కీ, బ‌ల్గేరియాల‌ను తుపాను ముంచెత్తింది. దీంతో జీవాలు అత‌లాకుత‌ల‌మ‌య్యాయి. తుపాను తెరిపినివ్వ‌డంతో.. జంతువులు మేత కోసం బ‌య‌ల్దేరాయి. సెంట్ర‌ల్ గ్రీస్‌లోని థెస్సాలీలోని అల్మిరోస్ ప‌ట్ట‌ణానికి స‌మీపంలో ఉన్న గ్రీన్‌హౌస్‌లో గంజాయి సాగు చేస్తున్నారు. ఈ గంజాయి తోట‌లోకి ఓ గొర్రెలు ప్ర‌వేశించి, ఆ మొక్క‌ల‌ను పూర్తిగా తినేశాయి.

ఇక ఆ త‌ర్వాత గంజాయి తిన్న గొర్రెలు వింత‌గా ప్ర‌వ‌ర్తిస్తున్నాయి. మేక‌ల కంటే ఎత్తు ఎగిరి గంతేస్తున్నాయి. దీంతో గొర్రెల కాప‌రికి అనుమానం వ‌చ్చింది. గొర్రెలు ఎందుకు వింత‌గా ప్ర‌వ‌ర్తిస్తున్నాయ‌నే విష‌యంపై దృష్టి సారించాడు. గొర్రెలు గంజాయి తిన‌డంతోనే ఈ విధంగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్లు తెలుసుకున్నాడు.

అయితే ఈ గంజాయి 100 కిలోలు ఉంటుంద‌ని తోట య‌జ‌మాని పేర్కొన్నాడు.

అయితే గ్రీక్‌లో గంజాయిపై నిషేధం లేదు. 2017 నుంచి గంజాయిని మెడిసిన‌ల్ ప్లాంట్‌గా గుర్తించారు. వివిధ రకాల మందుల త‌యారీలో గంజాయిని ఉప‌యోగిస్తున్నారు. దీంతో గంజాయి మొక్క‌ల‌ను ప‌లువురు సాగు చేస్తున్నారు.

గ‌తేడాది నవంబ‌ర్‌లో భార‌త్‌లో ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. పోలీసు గోదాముల్లో ఉంచిన 500 కిలోల గంజాయిని ఎలుక‌లు పూర్తిగా తిన్న‌ట్లు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పోలీసులు కోర్టుకు తెలిపిన సంగ‌తి తెలిసిందే.