Karnataka Assembly Elections | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా.. మే 10న ఎన్నికలు
Karnataka Assembly Elections | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఒకే దశలో మే 10న ఎన్నికలు జరున్నాయి. అదే నెల 13న ఫలితాలను వెల్లడించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికలకు ఏప్రిల్ 13న నోటిఫికేషన్‌ను ప్రకటించనున్నది. ఏప్రిల్ 20 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 21న నామినేషన్లను పరిశీలిస్తారు. 24 వరకు నామపత్రాల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. మే 10న పోలింగ్, 13న కౌంటింగ్ జరుగనున్నది. రాష్ట్రంలో 5.21కోట్ల […]

Karnataka Assembly Elections | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఒకే దశలో మే 10న ఎన్నికలు జరున్నాయి. అదే నెల 13న ఫలితాలను వెల్లడించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికలకు ఏప్రిల్ 13న నోటిఫికేషన్‌ను ప్రకటించనున్నది. ఏప్రిల్ 20 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 21న నామినేషన్లను పరిశీలిస్తారు. 24 వరకు నామపత్రాల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.
మే 10న పోలింగ్, 13న కౌంటింగ్ జరుగనున్నది. రాష్ట్రంలో 5.21కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో 16,976 మంది వంద సంవత్సరాలుపైబడిన ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. 80 ఏళ్లు పైబడి 12.15లక్షల మంది ఉన్నారని, 5.55లక్షల మంది దివ్యాంగులు ఉన్నారని చెప్పింది. 2018-19 నుంచి తొలిసారిగా ఓటర్లు 9.17లక్షలు పెరిగినట్లు ప్రకటించింది. ఒక్కో పోలీస్‌స్టేషన్‌కు సగటున 883 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపింది. ఎన్నికల సందర్భంగా 240 మోడల్ పోలింగ్ స్టేషన్లను, గ్రీన్ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పింది. మరో వంద బూత్‌లను పూర్తిగా దివ్యాంగులతో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఎన్నికల కోసం 58వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 36 ఎస్సీలకు, 15 ఎస్టీలకు రిజర్వ్ చేసినట్లు వివరించింది. మరో వైపు ప్రస్తుత శాసనసభ పదవీకాలం మే 24తో ముగియనున్నది. ఇంతకు ముందు మే 2018న ఎన్నికలు జరిగాయి. 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందుగా బీజేపీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నది. దక్షిణ భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం బీజేపీ. ఈ నేపథ్యంలో 224 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో.. 2018 ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది.