పోకిరి బ్యూటీ ఇంత‌లా మారిపోయింది… ఇప్పుడెలా ఉందో చూడండి..!

పోకిరి బ్యూటీ ఇంత‌లా మారిపోయింది… ఇప్పుడెలా ఉందో చూడండి..!

డాషింగ్ డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్ తీసిన పోకిరి చిత్రం ఎంత పెద్ద సెన్సేష‌న్ అయిందో ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌హేష్ బాబు, ఇలియానా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆకట్టుకుంది. 2006 వ సంవత్సరంలో పూరి జగన్నాథ్ చేసిన పోకిరి సినిమా అప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసి స‌రికొత్త రికార్డ్‌లు సెట్ చేసింది. ఈ సినిమాతో మ‌హేష్ బాబుకి విప‌రీత‌మైన మాస్ ఫాలోయింగ్ కూడా ద‌క్కింది.పోకిరి సినిమాలో మహేష్ బాబు లుక్స్ , డైలాగ్స్ ప్రేక్షకులను ఉర్రుతలూగించాయంటే అతిశ‌యోక్తి కాదు. మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ గా తొలిసారి క‌నిపించే స‌రికి ప్రేక్ష‌కుల ఆనందం అంతా ఇంతా కాదు.

ఇక ఈ చిత్రంలో మ‌హేష్ బాబుతో పాటు చాలా పాత్ర‌లు ప్రేక్ష‌కుల‌కి ఎంత‌గానో క‌నెక్ట్ అయ్యాయి. వారిలో విలన్ గ్యాంగ్ లో ఉండే యువతి కూడా అంద‌రిని ఎంత‌గానో అల‌రించంది. ఈ అమ్మడు పేరు జ్యోతి రానా. చిత్రంలో ప్రకాష్ రాజ్ కి వేరే వాళ్ళతో డీల్ మాట్లాడినప్పుడు ప్రకాష్ రాజ్ పక్కన ఈమె కూర్చొని ఉంటుంది.అప్పుడు ప్రకాష్ రాజ్ ఆమెని గిల్లుతాడు. ఆ సమయంలో ఆమె అరుస్తుంది. దాంతో ప్రకాష్ రాజ్ కోపం గా గిల్లితే గిల్లిచ్చుకోవాలి కానీ అరవకూడదు అనే డైలాగ్ కూడా చెప్తాడు. బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించిన ఈచిన్నది సినిమాలో కనిపించేది కొంచెం సేపు అయిన కూడా ప్రేక్ష‌కుల‌కి బాగా క‌నెక్ట్ అయింది. ఈ సినిమా త‌ర్వాత అమ్మ‌డికి చాలా సినిమా అవకాశాలు వ‌చ్చాయ‌ట‌.

అయితే ఏ సినిమాలో నటించడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని తెలుస్తుంది. స్వతహాగా ఆమె ముంబైలో పుట్టి పెరిగిన యువతీ కావడం వల్ల సినిమాల మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండడంతో కొన్ని సినిమాల‌లో న‌టించి త‌ర్వాత ఇండ‌స్ట్రీకి గుడ్ బై చెప్పింది. ప్ర‌స్తుతం యోగా టీచ‌ర్‌గా త‌న కెరీర్‌ని కొన‌సాగిస్తుంది. సర్టిఫైడ్ యోగ ఇన్స్ట్రక్టర్ గా కూడా రాణిస్తుంది. ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న నేప‌థ్యంలో ఆమె గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ గూగుల్ ను గాలిస్తున్నారు. దాంతో ఈ ముద్దుగుమ్మ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. జ్యోతి నిత్యం యోగ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజ‌న్స్‌ని అల‌రిస్తూ ఉంటుంది.