యాడ్‌లో న‌టించి అద‌ర‌గొట్టిన అల్లు అర్జున్ భార్య‌.. ఇక నెక్స్ట్ సినిమాల్లోనే..!

యాడ్‌లో న‌టించి అద‌ర‌గొట్టిన అల్లు అర్జున్ భార్య‌.. ఇక నెక్స్ట్ సినిమాల్లోనే..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు గ్లోబ‌ల్ స్టార్ అన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న కుమార్తె శాకుంత‌లం చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చి అద‌ర‌గొట్టింది. ఇక బ‌న్నీ భార్య స్నేహా రెడ్డి కూడా వెండితెర ఆరంగేట్రం చేయ‌బోతున్న‌ట్టు కొన్నాళ్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. నెట్టింట బన్నీ భార్యగా అల్లు స్నేహా రెడ్డికి ఫుల్ ఫాలోయింగ్ ఉంటుంది. బన్నీకి సంబంధించిన పర్సనల్ విషయాలు, ఫోటోలు, వీడియోలను స్నేహా రెడ్డి ఎక్కువగా త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ అల‌రిస్తుంటుంది. అర్హ, అయాన్‌లకు సంబంధించిన అప్డేట్లను కూడా అభిమానులకు అందిస్తుంటుంది. ఇటీవ‌ల స్నేహా రెడ్డి నెట్టింట్లో రకరకాల ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానుల‌ని థ్రిల్ చేస్తుంది.

మోడ్రన్ అవుట్ ఫిట్స్‌లో స్నేహా రెడ్డి గ్లామరస్ ఫోటోలకి కుర్ర‌కారు చిత్తైపోతున్నారు.రోజు రోజుకి ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఈమెను ఇన్‌స్టాగ్రామ్‌లో 9.1 మిలియన్ ఫాలో అవుతున్నారు. ఇక అది అలా ఉంటే స్నేహ రెడ్డి.. ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఓ బిజినెస్‌‌ను స్టార్ట్ చేసి బాగానే సంపాదిస్తుంది. అల్లు స్నేహా స్థాపించిన పికాబు సంస్థ మరింత విస్తరిస్తోంది.ఈ కార్నివాల్‌లో షాపింగ్ ఎంజాయ్‌మెంట్ యాక్టివిటీస్, రుచికరమైన వంటకాలు, లైవ్ మ్యూజిక్‌ ఆకట్టుకునే విధంగా ఉండనున్నాయట. ఇక ఈ ఈవెంట్ జనవరి 20న హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉదయం 10 గంటలకు షురూ కానుంది. స్నేహా రెడ్డి తాజాగా ఒక యాడ్‌లో కూడా క‌నిపించి అల‌రించింది.

కిండర్ బ్రాండ్ కు సంబంధించిన కిండర్‌ ఎస్ చోకో బోన్ క్రిస్పీ ప్రాడక్ట్ ను ప్రమోట్ చేస్తూ స్నేహా రెడ్డి యాడ్‌లో న‌టించింది. యాడ్‌కి త‌గ్గ‌ట్టు అద్భుత‌మైన ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది స్నేహా. అల్లు అర్జున్ భార్య ఇలా యాడ్ షూట్ లో నటించడంతో బన్నీ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. అద‌ర‌గొట్టేశావు, ఇక సినిమాల‌లోకి రావ‌డ‌మే త‌రువాయి అంటూ కొంద‌రు క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. మరి కొంద‌రు యాడ్‌లో ఉన్న బాబు స్థానంలో అయాన్‌ని పెట్టి ఉంటే అదిరిపోయేది అని అంటున్నారు. మొత్తానికి స్నేహారెడ్డి తొలి సారి ఇలా స్క్రీన్‌పై క‌నిపించి అద‌ర‌గొట్టింది.