Aditya Infotech| IPOకు ఆధిత్య ఇన్ఫోటెక్
ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్ తన ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)ను జూలై -29- 2025న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ IPO ద్వారా కంపెనీ మొత్తం రూ. 1300 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది
Aditya Infotech|
విధాత,హైదరాబాద్: ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్ తన ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO)ను జూలై -29- 2025న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ IPO ద్వారా కంపెనీ మొత్తం రూ. 1300 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ. 500 కోట్ల విలువైన కొత్త షేర్ల జారీ, ప్రస్తుత షేర్‌హోల్డర్ల ద్వారా రూ.800 కోట్ల విలువైన షేర్ల విక్రయం ఉన్నాయి. ఈ IPO కోసం షేర్ ధరల శ్రేణిని ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 640 నుండి రూ.675 వరకు నిర్ణయించారు.
బిడ్ / ఆఫర్ జూలై 29న ప్రారంభమై జూలై 31-2025న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ జూలై 28న జరుగనుంది. పెట్టుబడిదారులు కనీసం 22 ఈక్విటీ షేర్ల కోసం, ఆపై 22 షేర్ల గుణకాల్లో బిడ్లు వేయవచ్చు. కంపెనీ అర్హులైన ఉద్యోగుల కోసం ఉద్యోగుల రిజర్వేషన్ పోర్షన్‌లో బిడ్ చేసే వారికి ఒక్కో షేరుపై రూ.60 డిస్కౌంట్ అందిస్తోంది. తాజా షేర్ల జారీ ద్వారా వచ్చే నిధులను కంపెనీ తన అప్పులను పాక్షికంగా లేదా పూర్తిగా తిరిగి చెల్లించడానికి, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం ఉపయోగించుకోవాలని భావిస్తోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram