Airtel | స్పెషల్‌ డేటా ప్యాకేజీని ప్రకటించిన ఎయిర్‌టెల్‌.. రూ.9కే పది జీబీ డేటా..!

Airtel | ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇటీవల రెండు కొత్త ప్లాన్స్‌ను ప్రకటించిన కంపెనీ.. తాజాగా మరో సరికొత్త ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఎవరూ ఊహించలేని విధంగా తక్కువ రీఛార్జ్‌ ప్లాన్స్‌ను ట్రెండ్‌ను కొనసాగిస్తున్నది.

Airtel | స్పెషల్‌ డేటా ప్యాకేజీని ప్రకటించిన ఎయిర్‌టెల్‌.. రూ.9కే పది జీబీ డేటా..!

Airtel | ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ (Airtel) యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇటీవల రెండు కొత్త ప్లాన్స్‌ను ప్రకటించిన కంపెనీ.. తాజాగా మరో సరికొత్త ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఎవరూ ఊహించలేని విధంగా తక్కువ రీఛార్జ్‌ ప్లాన్స్‌ (Recharge Plan) ట్రెండ్‌ను కొనసాగిస్తున్నది. రూ.9తో ప్రత్యేక డేటా ఆఫర్‌ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో ఏకంగా పది జీబీ డేటా లభిస్తుంది. అయితే, ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ కేవలం గంట సమయం మాత్రమే ఉంటుంది. ఈ ప్లాన్ ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP) పరిమితి 10 జీబీగా ఉందని, ఆ తర్వాత స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోతుందని ఎయిర్‌టెల్ తెలిపింది.

యూజర్లు ఎంత డేటా వినియోగించుకోవాలనుకున్నా గంట వ్యవధిలోనే వాడుకోవాల్సి రానున్నది. ఈ ఆఫర్‌ తక్కువ సమయంలో ఎక్కువ డేటా అవసరమైన యూజర్లకు ఉపయోగపడనున్నది. సాధారణంగా టెలికం కంపెనీల ప్లాన్‌ను పరిశీలిస్తే.. 10 జీబీ అదనపు డేటా కావాలనుకుంటే దాదాపు రూ.100 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దాంతో రూ.9 రీఛార్జ్‌ చాలా ఉపయుక్తంగా ఉండనున్నది. కాగా రూ.9తో 10 జీబీ లభిస్తుండగా.. రూ.18 రీఛార్జ్‌తో యూజర్లు 20జీబీ డేటాను పొందే అవకాశం కల్పించింది. ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌లో ఈ ప్లాన్ ప్రస్తుతం యూజర్లకు అందుబాటులో ఉంది.

ఇదిలా ఉండగా.. కంపెనీ ఇటీవల సరికొత్త రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్‌ కింద ఆకర్షణీయంగా 45 రోజుల వ్యాలిడిటీని కంపెనీ అందివ్వనుండగా.. 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, మొత్తం 600 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. మొత్తంగా చూస్తే ఈ ప్లాన్‌పై యూజర్‌ రోజుకు కేవలం రూ.6.2 మాత్రమే వెచ్చిస్తారు. అయితే డేటా పరిమితంగా ఉంటుంది. 2జీబీ కంటే ఎక్కువ డేటా కావాలనుకుంటే రోజుకి రూ.19తో ‘యాడ్ ఆన్ డేటా’ వోచర్‌లను రీఛార్జ్ చేసుకోవాల్సి రానున్నది. ఇక ఈ ప్లాన్‌లో భాగంగా అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలో ట్యూన్‌లు, వింక్ మ్యూజిక్ ప్రయోజనం సైతం లభిస్తుంది. 70 రోజుల వ్యాలిడిటీతో రూ.395 ప్లాన్‌ను సైతం తీసుకువచ్చింది.