Bajaj EV Scooter | బజాజ్‌ బ్లూ 3202 ఈవీ స్కూటర్‌తో ఇక దూసుకుపోండి..! బ్యాటరీతో ఇక పని లేదు..!

Bajaj EV Scooter | ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహనాల సంస్థ బజాజ్‌ (Bajaj) ఎలక్ట్రికల్‌ వాహనాల (Electric Vehicle) ను విస్తరిస్తున్నది. ప్రస్తుతం మార్కెట్లు ఈవీలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కంపెనీ ఈ రంగంపై దృష్టి సారించింది.

Bajaj EV Scooter | బజాజ్‌ బ్లూ 3202 ఈవీ స్కూటర్‌తో ఇక దూసుకుపోండి..! బ్యాటరీతో ఇక పని లేదు..!

Bajaj EV Scooter | ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహనాల సంస్థ బజాజ్‌ (Bajaj) ఎలక్ట్రికల్‌ వాహనాల (Electric Vehicle) ను విస్తరిస్తున్నది. ప్రస్తుతం మార్కెట్లు ఈవీలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కంపెనీ ఈ రంగంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో కంపెనీ తాజాగా మరో బ్లూ 3202 (Blue 3202) వేరియంట్‌ను తీసుకువచ్చింది. వాస్తవానికి బజాజ్‌ నుంచి స్వాపబుల్‌ బ్యాటరీ (Swappable Battery) మోడల్‌ కోసం వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కంపెనీ ఇప్పటికే ఓ మోడల్‌పై పని చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. బ్లూ 3202 స్కూటర్‌ స్వాపబుల్ లేదంటే.. రిమూవబుల్ బ్యాటరీలతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ కావడం విశేషం. బజాజ్‌కు చెందిన కొత్త ఈ-స్కూటర్‌ మార్కెట్‌లో ఉన్న ఓలా, ఏథర్‌, టీవీఎస్‌ ఐక్యూబ్‌ తదితర మోడల్స్‌తో పోటీపడనున్నది.

ఈ సందర్భంగా కంపెనీకి చెందిన ఓ సీనియర్‌ అధికారి మాట్లాడుతూ మార్కెట్‌లో ఛార్జింగ్‌ స్టేషన్‌ని సైతం ఇన్‌స్టాల్‌ చేసేందుకు ఈ చర్య తీసుకుంటామన్నారు. తద్వారా బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్‌ నుంచి స్వాపింగ్‌ చేసుకోవడం ద్వారా వినియోగదారులు తమ స్వాప్‌ చేసుకొని ప్రయాణం విజయవంతంగా కొనసాగింవచ్చని పేర్కొన్నారు. బ్యాటరీ స్వాపింగ్‌ అంటే బ్యాటరీని స్కూటర్‌ నుంచి తీసి స్టేషన్లో దాన్ని ఇచ్చి.. ఫుల్‌ ఛార్జింగ్‌ ఉన్నదానితో మార్చుకోవచ్చు. దాంతో ఛార్జింగ్‌ కోసం ఇబ్బందులుపడాల్సిన అవసరం ఉండదు. దీంతో పాటు ఇంట్లోనే బ్యాటరీని చార్జింగ్‌ చేసుకునే సదుపాయం సైతం ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక బజాజ్‌ చేతక్ బ్లూ 3202ని లాంచ్‌ చేసింది. ఈ స్కూటర్‌ ఎక్స్‌షోరూం ధరని రూ.1.15లక్షలుగా నిర్ణయించింది. బ్లూ 3202 కొత్తగా పేరు మార్చిన అర్బన్ వేరియంట్ కాగా.. బ్యాటరీ సామర్థ్యంలో ఎలాంటి మార్పులు లేవు. అయితే, విశేషం ఏంటంటే.. దీని పరిధి 126 కిలోమీటర్ల కాగా.. ప్రస్తుతం 137 కిలోమీటర్లకు పెరిగింది. ఇక చేతక్ మొదటి అర్బన్ వేరియంట్ ధరను రూ.1.23 లక్షలకు తగ్గించింది.

ఇక చేతక్‌ బ్లూ 3202 ఛార్జింగ్‌ విషయానికి వస్తే ఆఫ్-బోర్డ్ 650 వాట్ ఛార్జర్ నుంచి బ్లూ 3202ని ఫుల్‌ ఛార్జింగ్‌ చేసేందుకు 5.50గంటల సమయం పడుతుంది. బ్లూ 3202 స్కూట్‌ చూసేందుకు అర్బన్ వేరియంట్‌ను పోలి ఉంటుంది. కీలెస్ ఇగ్నీషన్, కలర్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. స్పోర్ట్స్ మోడ్‌లో గంటకు 73 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ, హిల్ హోల్డ్, రివర్స్ మోడ్ సైతం ఉన్నాయి. బ్లూ, వైట్, బ్లాక్, గ్రే రంగుల్లో బైక్‌ అందుబాటులో ఉంది. కంపెనీ తన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పోర్ట్‌ఫోలియోలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వెర్షన్‌ను ఆగస్టులో లాంచ్‌ చేసింది. దీనికి చేతక్ 3201గా పేరు పెట్టింది. ఇది ఒకసారి ఫుల్‌ఛార్జ్‌ చేస్తే 136 కిలోమీటర్లు దూసుకెళ్తుంది. ఈ స్కూటర్‌ ఎక్స్‌షోరూం ధర రూ.1.30లక్షలు. ఈఎంపీఎస్-2024 స్కీమ్‌తో వస్తుండగా.. అమెజాన్‌ సైతం నుంచి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది.