BOI: ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకానికి.. బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగ‌ళం

BOI: ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకానికి.. బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగ‌ళం

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా, 400 రోజుల ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని ఉపసంహరించినట్లు ప్రకటించింది. ఈ పథకంలో గరిష్టంగా 7.30% వడ్డీ రేటు అందుతుంది. అలాగే, వివిధ మెచ్యూరిటీలకు సంబంధించి షార్ట్-టర్మ్, మీడియం-టర్మ్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై వడ్డీ రేట్లను ఏప్రిల్ 15, 2025 నుంచి తగ్గిస్తున్నట్లు బ్యాంక్ తెలిపింది. రూ.3 కోట్ల కంటే తక్కువ మొత్తంలో డిపాజిట్‌లకు సవరించిన రేట్లు ఈ విధంగా ఉన్నాయంటే… 91 నుంచి 179 రోజుల మెచ్యూరిటీ కలిగిన డిపాజిట్‌లకు 4.25%, 180 రోజుల నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ వ్యవధికి 5.75% వడ్డీ అందుతుంది.

ఒక సంవత్సరం మెచ్యూరిటీ కలిగిన డిపాజిట్‌లకు 7.05%, ఒక సంవత్సరం పైబడి రెండు సంవత్సరాల వరకు ఉన్నవాటికి 6.75% వడ్డీ రేటు లభిస్తుంది. రూ.3 కోట్ల నుంచి రూ.10 కోట్ల కంటే తక్కువ మొత్తంలో డిపాజిట్‌లకు, 91 నుంచి 179 రోజుల మెచ్యూరిటీకి 5.75%, 180 నుంచి 210 రోజుల వరకు 6.25%, 211 రోజుల నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ వ్యవధికి 6.50% వడ్డీ రేటు అందుబాటులో ఉంటుంది. ఒక సంవత్సరం మెచ్యూరిటీకి 7.05%, ఒక సంవత్సరం పైబడి రెండు సంవత్సరాల కంటే తక్కువ వ్యవధికి 6.70% వడ్డీ లభిస్తుంది. ఈ సవరించిన రేట్లు ఏప్రిల్ 15, 2025 నుంచి అమలులోకి వస్తాయి. అదనంగా, రూ.3 కోట్ల కంటే తక్కువ మొత్తంలో ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ మెచ్యూరిటీ వ్యవధి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై సూపర్ సీనియర్ సిటిజన్లకు 0.65%, సీనియర్ సిటిజన్లకు 0.50% అదనపు వడ్డీ రేటు అందుతుంది.