Budget 2024 | మొరార్జీ దేశాయ్‌ రికార్డ్‌ బ్రేక్‌ చేయనున్న నిర్మలమ్మ..! 1951 నుంచి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రులు ఎందరో తెలుసా..?

Budget 2024 |పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మంగళవారం ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలమ్మ అరుదైన ఘనతను సాధించనున్నారు. వరుసగా ఏడుసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా రికార్డును నెలకొల్పబోతున్నారు.

Budget 2024 | మొరార్జీ దేశాయ్‌ రికార్డ్‌ బ్రేక్‌ చేయనున్న నిర్మలమ్మ..! 1951 నుంచి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రులు ఎందరో తెలుసా..?

Budget 2024 | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మంగళవారం ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలమ్మ అరుదైన ఘనతను సాధించనున్నారు. వరుసగా ఏడుసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా రికార్డును నెలకొల్పబోతున్నారు. ఇప్పటి వరకు సీతారామన్ కాకుండా అత్యధికంగా ఆరుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రికార్డు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్నది. ఈసారి మాజీ ప్రధాని దేశాయ్‌ రికార్డును నిర్మలమ్మ బ్రేక్‌ చేయనున్నారు. అంతే కాకుండా నిర్మలా సీతారామన్‌ నేడు పార్లమెంట్‌లో సుదీర్ఘ బడ్జెట్‌ ప్రసంగం ఇవ్వబోతున్నారు. అప్పటి వరకు ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్ల ప్రసంగం ఎంత వరకు సాగిందో తెలుసుకుందాం. సాధారణ ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఒకటిన మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. ఈ ప్రసంగం 56 నిమిషాల పాటు కొనసాగింది. 2023-24 బడ్జెట్‌ సమయంలో 87 నిమిషాల బడ్జెట్ ప్రసంగాన్ని వినిపించారు. 2019లో ఆమె బడ్జెట్ ప్రసంగం 2 గంటల 17 నిమిషాలు సాగింది. 2022లో ఆమె 92 నిమిషాల పాటు ప్రసంగించారు.

అత్యధిక బడ్జెట్‌ ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రిగా రికార్డు..

నిర్మలా సీతారామన్ భారత చరిత్రలో సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగాన్ని చదివిన రికార్డును సొంతం చేసుకున్నారు. కేంద్ర బడ్జెట్ 2020 ప్రసంగం భారతదేశ చరిత్రలో సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం. ఇది 2 గంటల 42 నిమిషాల పాటు కొనసాగింది. ఈ సమయంలో ఆమె 2019 కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన సమయంలో 2 గంటల 17 నిమిషాల రికార్డును బద్దలు కొట్టింది. ఆమెకు ముందు, దివంగత అరుణ్ జైట్లీ పేరిట సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం రికార్డు ఉంది. జైట్లీ 2014 బడ్జెట్ ప్రసంగం 2 గంటల 10 నిమిషాలు కొనసాగింది. 2019 సంవత్సరంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019-2020 ఆర్థిక సంవత్సరానికి తన మొదటి బడ్జెట్‌ను సమర్పించారు. ఆ ప్రసంగంతో ఆమె సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగ రికార్డును బద్దలు కొట్టారు. ఆమె 2గంటల 17 నిమిషాల పాటు ప్రసంగించారు. మరుసటి సంవత్సరం, 2020-21 సంవత్సరానికి బడ్జెట్‌ను సమర్పిస్తూ 2 గంటల 42 నిమిషాల పాటు మాట్లాడిన ఆమె తన రికార్డును తానే బద్దలు కొట్టారు. 2021-22లో ఆమె బడ్జెట్ ప్రసంగం 100 నిమిషాలు. మరోవైపు, 2022-23 సంవత్సరానికి బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ మొత్తం గంటన్నర సేపు మాట్లాడారు.

తక్కువ బడ్జెట్‌ ప్రసంగం చేసింది..

నిర్మలా సీతారామన్‌ కంటే ఎక్కువ కాలం బడ్జెట్‌ ప్రసంగం చేసిన రికార్డును బీజేపీ నేత జస్వంత్‌ సింగ్‌ సొంతం చేసుకున్నారు. 2003లో 2 గంటల 15 నిమిషాల బడ్జెట్‌ను సమర్పించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతి తక్కువ బడ్జెట్ ప్రసంగాన్ని 1977లో హిరూభాయ్ ఎం పటేల్ చేశారు. ఆయన కేవలం 800 పదాల మధ్యంతర బడ్జెట్ ప్రసంగం చేశారు. 9300 పదాలతో కూడిన అతి తక్కువ పూర్తి బడ్జెట్ ప్రసంగం వైబీ చవాన్. 10వేల పదాలతో మొరార్జీ దేశాయ్ రెండో అతి చిన్న ప్రసంగాన్ని చేశారు. మాటల పరంగా 1991లో మన్మోహన్ సింగ్ చేసిన బడ్జెట్ ప్రసంగం అత్యంత సుదీర్ఘమైనది. 18,700 పదాలతో కొనసాగగా.. ఆ తర్వాత తర్వాత యశ్వంత్ సిన్హా ప్రసంగం 15700 పదాలతో బడ్జెట్‌ ప్రసంగం చేశారు.

పదిసార్లు సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మొరార్జీ దేశాయ్‌..

మొరార్జీ దేశాయ్ సాధారణ బడ్జెట్‌ను గరిష్ఠంగా 10 సార్లు సమర్పించారు. ఆయన తర్వాత పి చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ కూడా 9 సార్లు, యశ్వంత్ రావ్ చవాన్ 7 సార్లు, సీడీ దేశ్‌ముఖ్ 7 సార్లు, యశ్వంత్ సిన్హా 7 సార్లు, మన్మోహన్ సింగ్ 6 సార్లు, టీటీ కృష్ణమాచారి కూడా 6 సార్లు సాధారణ బడ్జెట్‌ను సమర్పించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జూలై 23న వరుసగా ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఆమె ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ను సైతం ప్రవేశపెట్టారు. ఇక 1947 సాధారణ బడ్జెట్ మొత్తం 92 సార్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇందులో సాధారణ, మధ్యంతర బడ్జెట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 67సార్లు వార్షిక బడ్జెట్లు, 15 మధ్యంతర బడ్జెట్లు, నాలుగు ప్రత్యేక బడ్జెట్లు ఉన్నాయి. ఇక 1951 నుండి ఫిబ్రవరి 2024 వరకు దేశంలోని 12 మంది ఆర్థిక మంత్రులు బడ్జెట్‌ను సమర్పించారు. వీరితో పాటు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రులుగా ఉన్న సమయంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

ఆర్థిక మంత్రులుగా పని చేసింది వీళ్లే..

సీడీ దేశ్‌ముఖ్ (1951-57)
మొరార్జీ దేశాయ్ (1959-64, 1967-70)
వైబీ చవాన్‌ (1971-75)
వీపీ సింగ్ (1985-1987)
మన్మోహన్ సింగ్ (1991-96)
యశ్వంత్ సిన్హా (1998-2002)
జస్వంత్ సింగ్ (1996-1996, 2002-2004)
పీ చిదంబరం (1996-98, 2004-09, 2013-14)
ప్రణబ్ ముఖర్జీ (1982-85, 2009-13)
అరుణ్ జైట్లీ (2014-19)
పీయూష్ గోయల్ (2019)
నిర్మలా సీతారామన్ (2019-2024)