Kulfi Ice Cream | ‘కుల్ఫీ ఐస్‌క్రీమ్‌’తో కాసుల వ‌ర్షం.. ఏడాదికి రూ. కోటి సంపాదిస్తున్న మ‌హిళ‌

Kulfi Ice Cream | ఆమె జీవితాన్ని ఒకే ఒక్క కుల్ఫీ ఐస్‌క్రీం( Kulfi Ice Cream ) మార్చేసింది. ఒక్క కుల్ఫీ ఐస్‌క్రీమ్‌తో ప్రారంభ‌మైన ఆమె వ్యాపారం.. ప్ర‌స్తుతం రోజుకు కొన్ని వేల ఐస్‌క్రీమ్స్‌ను విక్ర‌యిస్తూ.. కోట్ల సంపాద‌న‌కు చేరుకుంది. మ‌మ్మీ కుల్ఫీ( Mummy Kulfi ) పేరుతో ప్రారంభించిన ఆమె బిజినెస్ దేశ రాజ‌ధాని ఢిల్లీ( Delhi ) న‌లు మూల‌ల్లో మార్మోగిపోతోంది.

  • By: raj |    business |    Published on : Nov 12, 2025 9:01 AM IST
Kulfi Ice Cream | ‘కుల్ఫీ ఐస్‌క్రీమ్‌’తో కాసుల వ‌ర్షం.. ఏడాదికి రూ. కోటి సంపాదిస్తున్న మ‌హిళ‌

Kulfi Ice Cream | ఢిల్లీ( Delhi )కి చెందిన స‌మ‌త బోత్రా( Samta Bothra ) తండ్రి ఐస్ క్రీమ్స్( Ice Creams ) త‌యారు చేస్తూ, విక్ర‌యిస్తూ జీవ‌నం సాగించేవాడు. కానీ స‌మ‌త ఐస్ క్రీమ్ త‌యారీపై ఎప్పుడు కూడా దృష్టి సారించ‌లేదు. కానీ నాన్న చేసిన ఐస్‌క్రీమ్స్‌ను ఇష్టంగా తినేది. ఇక స‌మ‌త‌కు పెళ్లైన త‌ర్వాత ఢిల్లీలోనే సెటిలైంది. మూడు ద‌శాబ్దాల పాటు ఆమె ఇంటికి, వంటింటికే ప‌రిమిత‌మైంది.

జీవితాన్ని మ‌లుపు తిప్పిన హోళీ పండుగ‌

కానీ 2018లో హోళీ పండుగ సంద‌ర్భంగా కుల్ఫీ( Kulfi Ice Cream )ని ఇంట్లోనే త‌యారు చేసింది. దాన్ని కుటుంబ స‌భ్యులంద‌రూ తిని రుచి అద్భుత‌మని ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. సంతోషంతో ఉప్పొంగిపోయిన ఆమె.. ఆ త‌ర్వాత మ‌రిన్ని కుల్ఫీల‌ను త‌యారు చేసి బంధువుల‌కు పంపించారు. కొన్ని రోజుల త‌ర్వాత బంధువు ఒక‌రు ఫోన్ చేసి.. కుల్ఫీ మ‌ళ్లీ కావాల‌ని కోరింది. అలా బంధువుల నుంచి అనేక విన‌తులు వ‌చ్చాయి. దాంతో స‌మ‌త కుల్ఫీ బిజినెస్ చేయాల‌ని నిర్ణ‌యించుకుంది.

రూ. 5 వేల పెట్టుబ‌డితో..

త‌న కుమారుడి స‌హాయంతో స‌మ‌త ఓ చిన్న ప‌రిశ్ర‌మ‌ను నెల‌కొల్పారు. మొద‌ట‌గా ర‌బ్రీ, రోజ్, కేస‌ర్ ఫ్లేవ‌ర్స్‌తో కూడిన కుల్ఫీల‌ను త‌యారు చేసింది. ఇందుకు రూ. 5 వేలు ఖ‌ర్చు పెట్టింది. అలా పుట్టిందే మ‌మ్మీ కుల్ఫీ( Mummy Kulfi ) ప‌రిశ్ర‌మ‌. ఇక రెండు రోజుల‌కు ఒక‌సారి ఆర్డ‌ర్స్ వ‌చ్చేవి. ఆరేడు నెల‌ల త‌ర్వాత రెగ్యుల‌ర్‌గా కుల్ఫీల కోసం ఆర్డ‌ర్స్ రావ‌డంతో స‌మ‌త మ‌రింత దృష్టి సారించింది.

రోజుకు 2 వేల నుంచి 3 వేల వ‌ర‌కు

2019లో మ‌మ్మీ కుల్ఫీని జొమాటో, స్విగ్గీ వంటి సంస్థ‌ల ద్వారా విక్ర‌యించేది. ప్ర‌తి రోజు 60 నుంచి 70 దాకా ఆర్డ‌ర్లు వ‌చ్చేవి. సాయంత్రం 6 అయిందంటే చాలు జొమాటో, స్విగ్గీ డెలివ‌రీ బాయ్స్ స‌మ‌త కిచెన్ ద‌గ్గ‌ర వాలిపోయేవారు. ఇలా బిజినెస్ అభివృద్ధి చెందుతున్న కొద్ది రోజుకు 2 వేల నుంచి 3 వేల వ‌ర‌కు కుల్ఫీల‌ను అమ్మ‌డం ప్రారంభించారు. కార్పొరేట్ కంపెనీలు సైతం మ‌మ్మీ కుల్ఫీల‌ను ఆర్డ‌ర్ చేసేవ‌ని స‌మ‌త పేర్కొంది.

ఏడాదికి రూ. కోటి వ‌ర‌కు సంపాద‌న‌

ఆన్‌లైన్ ఆర్డ‌ర్స్‌కే మ‌మ్మీ కుల్ఫీల‌ను ప‌రిమితం చేయ‌కుండా రిటైల్ బిజినెస్‌లోకి కూడా ప్ర‌వేశించింది స‌మ‌త‌. ఈస్ట్ ఢిల్లీలోని కృష్ణా న‌గ‌ర్‌లో మ‌మ్మీ కుల్ఫీల పేరిట ఓ స్టాల్‌ను ఓపెన్ చేసింది. ఈ ప్ర‌యోగం స‌క్సెస్ కావ‌డంతో.. మ‌రుస‌టి ఏడాది వివేక్ న‌గ‌ర్, సూర‌జ్ మాల్ విహార్‌లో కూడా ప్రారంభించింది స‌మ‌త‌. ప్ర‌స్తుతం కుల్ఫీ, ఐస్ పాప్స్‌ను విక్ర‌యిస్తున్నారు. ఐస్ పాస్ ఒక్క‌టి రూ. 39 కాగా, క్లాసిక్ కుల్ఫీ ధ‌ర రూ. 69, ప్రీమియం కుల్ఫీ ధ‌ర రూ. 79 గా నిర్ణ‌యించారు. కేస‌ర్ పిస్తా, పాన్ బ‌హార్, సూప‌ర్ సీతాఫ‌ల్ వంటి ఫ్లేవ‌ర్స్‌తో కుల్ఫీల‌ను విక్ర‌యిస్తున్న‌ట్లు స‌మ‌త తెలిపింది. కుల్ఫీ వ్యాపారంతో నెల‌కు రూ. 10 ల‌క్ష‌ల చొప్పున‌ ఏడాదికి రూ. కోటి వ‌ర‌కు సంపాదిస్తున్న‌ట్లు ఆమె పేర్కొంది.