తగ్గుతున్న బంగారం ధరలు
బంగారం ధరలు మంగళవారం వరుసగా నాలుగో రోజు పడిపోయాయి. మంగళవారం మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ ధర 0.09% (రూ.42) తగ్గింది. తులం బంగారం ధర రూ.47,420 వద్ద ట్రేడయింది. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బంగారం తులం బంగారం ధర రూ.47,462గా నమోదైంది. గతవారం ఎంసీఎక్స్ ట్రేడింగ్లో తులం బంగారం ధర రూ.48,400 పలికి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. మరోవైపు వెండి ధర కూడా ట్రేడింగ్లో స్వల్పంగా పతనమైంది. ఎంసీఎక్స్ […]

బంగారం ధరలు మంగళవారం వరుసగా నాలుగో రోజు పడిపోయాయి. మంగళవారం మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ ధర 0.09% (రూ.42) తగ్గింది. తులం బంగారం ధర రూ.47,420 వద్ద ట్రేడయింది. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బంగారం తులం బంగారం ధర రూ.47,462గా నమోదైంది. గతవారం ఎంసీఎక్స్ ట్రేడింగ్లో తులం బంగారం ధర రూ.48,400 పలికి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది.
మరోవైపు వెండి ధర కూడా ట్రేడింగ్లో స్వల్పంగా పతనమైంది. ఎంసీఎక్స్ సిల్వర్ మే ఫ్యూచర్స్ ధర స్వల్పంగా 0.08 శాతం పతనమై రూ.68,626 వద్ద స్థిర పడింది. సోమవారం ముగింపులో రూ.68,680 వద్ద స్థిరపడింది.
ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర 0.10 శాతం పెరిగింది. ఔన్స్ బంగారం ధర 1,782 డాలర్లకు పలికింది. మరోవైపు వెండి స్పాట్ ధర ఔన్స్ కు 0.20 శాతం పెరిగి 26.25 డాలర్లకు ఎక్కువైంది. సుదీర్ఘకాలం స్పాట్ గోల్డ్ ధర 1760 డాలర్ల వద్ద తచ్చాడి.. తిరిగి 1820 డాలర్లకు చేరుతుందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.