Gold-Silver Rates | పసిడి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. నేడు మార్కెట్‌లో ధరలు ఇవే..!

Gold-Silver Rates | పసిడి, వెండి కొనుగోలుదారులకు తీపికబురు. ఆదివారం బులియన్‌ మార్కెట్‌లో ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం తులానికి రూ.66,35 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,380 పలుకుతున్నది.

Reported by: Mallanna | వాణిజ్యం | Jun 23, 2024, 10:52 am IST
Read Time: 3 mins
Gold-Silver Rates | పసిడి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. నేడు మార్కెట్‌లో ధరలు ఇవే..!

Gold-Silver Rates | పసిడి, వెండి కొనుగోలుదారులకు తీపికబురు. ఆదివారం బులియన్‌ మార్కెట్‌లో ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం తులానికి రూ.66,35 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,380 పలుకుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.69,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,040 వద్ద కొనసాగుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.72,380 వద్ద నిలకడగా ఉన్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.66,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,530 వద్ద స్థిరంగా ఉన్నది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.66,350 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.72,380 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి నిలకడగా ఉన్నది. ఢిల్లీలో కిలో వెండి రూ.92వేలు ఉండగా.. ఇక హైదరాబాద్‌లో రూ.96,500 పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.