Gold-Silver Rates | తగ్గిన పడిసి, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంత తగ్గాయో తెలుసా?

Gold-Silver Rates | పసిడి, వెండి ధరలు కొనుగోలుదారులకు భారీ ఊరట కల్పించాయి. బులియన్‌ మార్కెట్‌లో బుధవారం ధరలు పడిపోయాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.250 తగ్గి తులానికి రూ.66వేలకు చేరింది. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.230 తగ్గి తులానికి రూ.72వేలు పలుకుతున్నది.

Reported by: Mallanna | వాణిజ్యం | Jun 26, 2024, 12:09 pm IST
Read Time: 3 mins
Gold-Silver Rates | తగ్గిన పడిసి, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంత తగ్గాయో తెలుసా?

Gold-Silver Rates | పసిడి, వెండి ధరలు కొనుగోలుదారులకు భారీ ఊరట కల్పించాయి. బులియన్‌ మార్కెట్‌లో బుధవారం ధరలు పడిపోయాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.250 తగ్గి తులానికి రూ.66వేలకు చేరింది. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.230 తగ్గి తులానికి రూ.72వేలు పలుకుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.66,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,660కి తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.66వేలు ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.72వేలకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.66,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,150కి తగ్గింది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.66వేలు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.72వేలకు పతనమైంది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు పలుకుతుననాయి. మరో వైపు వెండి సైతం భారీగా తగ్గింది. వెండి ధర కిలోకు రూ.1000 తగ్గి.. ఢిల్లీలో ధర వెండి రూ.90వేలకు తగ్గింది. ఇక హైదరాబాద్‌లో రూ.94,500కి తగ్గింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.