ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం తుది దశకు చేరుకుని.. పశ్చిమాసియా యుద్ద ఉద్రిక్తతలు సద్దుమణుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా భౌగోళిక, ఆర్థిక పరిణమాల క్రమంలో బంగారం, వెండి ధరలు పుంజుకుంటున్నాయి. సోమవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,450 పెరిగి రూ. 1,51,530కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,250 పెరిగి రూ. 1,38,900వద్ద నిలిచింది. అటు కిలో వెండి ధర సైతం రూ. 10,000పెరిగి రూ. 2,80,000కు చేరింది.
భవిష్యత్తులో మరింత పైకి..
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇటీవల పడిపోయిన బంగారం ధరలు మూడు రోజులుగా తిరిగి పెరుగుతూ వస్తున్నాయి. తక్కువ ధరలను సద్వినియోగం చేసుకోవాలని భావించిన పెట్టుబడిదారులు, ఆభరణాల కొనుగోలుదారులు కొత్తగా కొనుగోళ్లు ప్రారంభించడంతో పసిడి ధరలను బలోపేతం చేసింది. దేశీయ మార్కెట్లో తులం బంగారంపై రూ. 2,500మేరకు పెరిగాయి. భారత్ లో శుభకార్యాలు ప్రారంభం కానుండటంతో బంగారం కొనుగోలు పెరిగే అవకాశం ఉంది. అటు అంతర్జాతీయంగా పశ్చియాసియా యుద్దం సద్దుమణుగడంతో పాటు అమెరికా ఫెడరల్ వడ్డీ రేట్ల మార్పు, ద్రవ్యోల్భణం, డాలర్ విలువ వంటి అంశాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పెరుగుదల బాట పట్టవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
