Gold-Silver Rates | బంగారం కొనాలనుకుంటున్నారా..? నేడు ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?

Gold-Silver Rates | కొనుగోలుదారులకు పసిడి ధరలు ఊరటనిస్తున్నాయి. వరుసగా రెండురోజులపాటు దిగివచ్చిన ధరలు బుధవారం బులియన్‌ మార్కెట్‌లో ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.22 క్యారెట్ల బంగారం రూ.66,200 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం తులానికి రూ.72,220 పలుకుతున్నది.

Reported by: Mallanna | వాణిజ్యం | Jun 19, 2024, 12:00 pm IST
Read Time: 3 mins
Gold-Silver Rates | బంగారం కొనాలనుకుంటున్నారా..? నేడు ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?

Gold-Silver Rates | కొనుగోలుదారులకు పసిడి ధరలు ఊరటనిస్తున్నాయి. వరుసగా రెండురోజులపాటు దిగివచ్చిన ధరలు బుధవారం బులియన్‌ మార్కెట్‌లో ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.22 క్యారెట్ల బంగారం రూ.66,200 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం తులానికి రూ.72,220 పలుకుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.66,960 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,050 పలుకుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.66,200 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.72,220కి వద్ద స్థిరంగా ఉన్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.66,200 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,220 వద్ద నిలకడగా కొనసాగుతున్నది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.66,200 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.72,220 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలోకు రూ.500 దిగివచ్చి ఢిల్లీలో కిలో వెండి రూ.91వేలు చేరింది. ఇక హైదరాబాద్‌లో రూ.95,600గా ఉన్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.