Gold-Silver Rates | మరోసారి తగ్గిన ధరలు..! తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు ఇవే..!

Gold-Silver Rates | వరుసగా రెండోరోజు సామాన్యులకు బంగారం ధరలు ఊరటనిచ్చాయి. బులియన్‌ మార్కెట్‌లో పసిడి ధరలు గురువారం మరోసారి తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.250 తగ్గి తులానికి రూ.65,750కి పతనమైంది. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.270 తగ్గి తులానికి రూ.71,930కి తగ్గింది.

Reported by: Mallanna | వాణిజ్యం | Jun 27, 2024, 11:25 am IST
Read Time: 3 mins
Gold-Silver Rates | మరోసారి తగ్గిన ధరలు..! తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు ఇవే..!

Gold-Silver Rates | వరుసగా రెండోరోజు సామాన్యులకు బంగారం ధరలు ఊరటనిచ్చాయి. బులియన్‌ మార్కెట్‌లో పసిడి ధరలు గురువారం మరోసారి తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.250 తగ్గి తులానికి రూ.65,750కి పతనమైంది. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ.270 తగ్గి తులానికి రూ.71,930కి తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.66,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,280కి దిగివచ్చింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.65,750 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.71,730 పలుకుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.65,900 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.71,880కి తగ్గింది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.65,750 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.71,730కి చేరింది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు పలుకుతున్నాయి. మరో వైపు వెండి నిలకడగా కొనసాగుతున్నది. ఢిల్లీలో ధర వెండి రూ.90వేలు ఉండగా.. హైదరాబాద్‌లో రూ.94,500 ధర పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.