పెరిగిన బంగారం ధరలు..!

బుధవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 440పెరిగి రూ.1,51,370వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 400పెరిగి రూ. 1,38,750వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ. 100తగ్గి రూ. 2,64,900వద్ద నిలిచింది.

హైదరాబాద్ : అమెరికా-ఇరాన్ యుద్ద పరిణామాల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న బౌగోళిక, ఆర్థిక పరిణామాల క్రమంలో బంగారం, వెండి ధరలు అస్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 440పెరిగి రూ.1,51,370వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 400పెరిగి రూ. 1,38,750వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ. 100తగ్గి రూ. 2,64,900వద్ద నిలిచింది.

భారీ ఆర్థిక సంక్షోభం..సరికొత్త రికార్డు ధరలు

ప్రముఖ ఆర్థిక నిపుణుడు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి 2026, 2027 మధ్య కాలంలో ప్రపంచ మార్కెట్లు అత్యంత భయంకరమైన పతనాన్ని చవిచూడబోతున్నాయని, ఇది దాదాపు “మహా మాంద్యం” (Great Depression) వంటి పరిస్థితికి దారితీస్తుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. తెలివైన పెట్టుబడిదారులకు ఇది ఒక అద్భుతమైన సంపద సృష్టికి లభించే అవకాశం అని ఆయన విశ్లేషించారు. మార్కెట్లు కుప్పకూలినప్పుడు భయపడి పారిపోవడం కంటే, ఆస్తులను తక్కువ ధరకు కొనుగోలు చేసి ధనవంతులు కావాలని ఆయన సూచిస్తున్నారు.ఇందుకోసం డబ్బులు సిద్దం చేసుకుని..తక్కువ ధరలకు ఆస్తుల కొనుగోలుకు సిద్దం కావాలని సూచించారు.

కియోసాకి అంచనా ప్రకారం రాబోయే ఈ ఆర్థిక సంక్షోభం తర్వాత విలువైన లోహాలైన బంగారం, వెండి ధరలు ఊహకందని స్థాయికి చేరుకుంటాయని, సాధారణంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పుడు ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారంపై మొగ్గు చూపుతారని విశ్లేషించారు. ఆర్థిక సంక్షోభ సమయంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతాయని అంచనా వేశారు.

ఇవి కూడా చదవండి :

కార్యకర్తే అధినేత అనేది టీడీపీ సిద్ధాంతం: చంద్రబాబు
Divya Sathyaraj | వివాహం చేసుకోకుండానే అమ్మ‌తనం సాధ్యం .. దివ్య వ్యాఖ్యలపై చర్చ, తండ్రి సత్యరాజ్ మద్దతు

Latest News