కార్యకర్తే అధినేత అనేది టీడీపీ సిద్ధాంతం: చంద్రబాబు
ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా సగర్వంగా ఎగిరే జెండా పసుపు జెండా. కార్యకర్తే అధినేత అనేది మన సిద్ధాంతం అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
అమరావతి : ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా సగర్వంగా ఎగిరే జెండా పసుపు జెండా. కార్యకర్తే అధినేత అనేది మన సిద్ధాంతం అని..దీనినే విధానంగా మార్చుకున్నాం..టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మంత్రి నారా లోకేశ్ బాధ్యతలు తీసుకున్నారు. పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలతో చంద్రబాబు ప్రమాణం చేయించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడారు. ఒక్క ఓటమితోనే రాజకీయ పార్టీలు చాపచుట్టేస్తున్నాయని..గెలిచినా.. ఓడినా.. సగర్వంగా ఎగిరే జెండా పసుపు జెండా అని స్పష్టం చేశారు. 44 ఏళ్లలో అనేక సంక్షోభాలు, సవాళ్లను చూశాం..పసుపు జెండా పౌరుషం ఎప్పుడూ తగ్గలేదు అని, సీనియర్లను గౌరవిస్తూ.. కొత్తవారికి కమిటీల్లో అవకాశం ఇచ్చాం అని, 2024 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే వచ్చే ఎన్నికల్లో అధికంగా రావాలి అని కేడర్ కు నిర్దేశించారు. బలమైన క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ తెలుగు దేశం అని సీఎం చంద్రబాబు అన్నారు.
నాలుగు దశాబ్దాలుగా పార్టీ కమిటీలను నియమిస్తున్నాం. సీనియర్లను గౌరవిస్తూ.. కొత్తవారికి అవకాశం ఇచ్చాం. కష్టపడిన వారికి చోటు కల్పిస్తూ కమిటీలు ఏర్పాటు చేశాం. సీనియారిటీ, సిన్సియారిటీతో దాదాపు 250 మందితో కమిటీ ఏర్పాటు చేశాం. మండల పార్టీ అధ్యక్షురాలు, క్లస్టర్ ఇన్‌ఛార్జిని పొలిట్‌బ్యూరో సభ్యులుగా చేయగలిగాం. కార్యకర్తే అధినేత అనేది మన సిద్ధాంతం.. ఆచరణలో చేసి చూపించాం అని చంద్రబాబు అన్నారు. సీనీయర్ ను అని, నా పర్మీషన్ లేనిదే పదవులు ఇవ్వవద్దని కొందరు నాకు చెబుతున్నారని..నియోజకవర్గంలో బలహీన పడితే సీనియర్ అయినా పట్టించుకోబోనని, ఇంటికి పిలిచి కాఫీ ఇచ్చి గౌరవిస్తానని తెలిపారు. యువగళంతో ప్రజల్లో చైతన్యానికి లోకేశ్ తీవ్రంగా కృషి చేశారు అని చంద్రబాబు అన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది పదవి కాదు… అత్యున్నత బాధ్యత..
ప్రతిపక్షంలో లోకేష్ చాలా కీలక పాత్ర పోషించారు. ట్రైనింగ్ క్లాసులు మొదలుకుని కార్యకర్తల సంక్షేమ బాధ్యతలను లోకేష్ సమర్థవంతంగా నిర్వహించారు. ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు ఏపీకి వచ్చాయంటే కారణం లోకేషే కారణం అని చంద్రబాబు చెప్పుకొచ్చారు
ప్రజలు మీపై ఓ కన్నేసి పెట్టారు.. మీరు ఎవరిని కలుస్తున్నారో గమనిస్తున్నారు.. అధికారం ఉందని ఇగోకు పోతే మీరే నష్టపోతారు.. ఫ్లెక్సీల దగ్గర గొడవపడుతున్నారు.. కార్యకర్తలు తప్పుచేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది.. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు నన్ను బాధపెట్టాయి.. ఎన్డీఏలో ఉన్నాం, మన ఉనికి కాపాడుకోవాలి.. ఐకమత్యం కాపాడాలి.. కేంద్రానికి, రాష్ట్రానికి చెడ్డపేరు రాకుండా పనిచేస్తున్నాం.. ఈ స్ఫూర్తి గ్రామం వరకు కొనసాగాలి అని చంద్రబాబు సూచించారు. కేంద్ర మంత్రి తప్పు చేస్తే జాతీయ స్థాయిలో హెడ్ లైన్స్ వస్తాయని, రాష్ట్ర మంత్రి తప్పుచేస్తే రాష్ట్రంలో పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని హెచ్చరించారు. ప్రజల్లో ఉన్నవారికి పదవులు, గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. ఎవరు పనిచేస్తే వారికే దండ వేస్తామని చంద్రబాబు తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి :
80 హిప్పోల ప్రాణదాత..అనంత్ అంబానీ!
కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ : హరీశ్ రావు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram