స్వల్పంగా పెరిగిన బంగారం..స్థిరంగా వెండి ధరలు
సోమవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 380పెరిగి రూ. 1,54,420వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 350 పెరిగి రూ. 1,41,550వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ. 2,70,000వద్ద స్థిరంగా నిలిచింది.
విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియా ఉద్రిక్తతలు..ప్రపంచ వ్యాప్తంగా బౌగోళిక, ఆర్థిక పరిణామాలలో మార్పుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలలో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. సోమవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 380పెరిగి రూ. 1,54,420వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 350 పెరిగి రూ. 1,41,550వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ. 2,70,000వద్ద స్థిరంగా నిలిచింది.
యుద్ద పరిస్థితులు తొలగిపోతేనే పసిడి పరుగులు..
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, అమెరికా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు ఈ వారం తీవ్ర అస్థిరతకు లోనయ్యే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.యుద్ధ విరమణకు సంబంధించి సానుకూల సంకేతాలు వస్తే బంగారం డిమాండ్ మళ్లీ పుంజుకుని ధరలు పెరిగే అవకాశం ఉంది. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు, వడ్డీనిచ్చే బాండ్లపై ఆసక్తి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
అంతర్జాతీయంగా ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, భౌతిక మార్కెట్లలో డిమాండ్ మాత్రం బలంగానే ఉంది. ముఖ్యంగా భారతదేశంలో సరఫరా కొరత కారణంగా బంగారంపై ఇచ్చే ప్రీమియంలు గత రెండు నెలల్లోనే అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతానికి బంగారం ధరలపై స్వల్పకాలిక ఒత్తిడి ఉన్నప్పటికీ, దీర్ఘకాలికంగా ధరలు పుంజుకుంటాయని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
రాజ్యసభలో 113 కు పెరిగిన బీజేపీ సంఖ్యా బలం
రైలు నుంచి పడిపోయిన బాలుడు..చైన్ లాగినా ఆపని లోకో పైలట్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram