Gold Rate | రూ.74వేలు దాటిన తులం పసిడి.. రూ.90వేలకు చేరువలో వెండి..

Gold Rate | బంగారం ధరలు కొనుగోలుదారులకు మరోసారి షాక్‌ ఇచ్చాయి. నిన్న నిలకడగా కొనసాగిన ధరలు సోమవారం బులియన్‌ మార్కెట్‌లో పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.550 పెరిగి తులానికి రూ.67,050 ఎగిసింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.600 పెరిగి.. తులానికి రూ.73,150కి పెరిగింది.

Reported by: Mallanna | వాణిజ్యం | Apr 15, 2024, 1:09 pm IST
Read Time: 3 mins
Gold Rate | రూ.74వేలు దాటిన తులం పసిడి.. రూ.90వేలకు చేరువలో వెండి..

Gold Rate | బంగారం ధరలు కొనుగోలుదారులకు మరోసారి షాక్‌ ఇచ్చాయి. నిన్న నిలకడగా కొనసాగిన ధరలు సోమవారం బులియన్‌ మార్కెట్‌లో పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.550 పెరిగి తులానికి రూ.67,050 ఎగిసింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.600 పెరిగి.. తులానికి రూ.73,150కి పెరిగింది. అదే సమయంలో వెండి ధరలు పెరిగాయి. ఇక దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.67,900 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.74,070కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.67,050 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.73,150కి పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.67,200 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,300కి చేరింది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.67,050 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.73,150 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి సైతం భారీగా పెరిగింది. రూ.500 పెరిగి కిలో రూ.86వేలకు ఎగిసింది. హైదరాబాద్‌లో కిలో ధర రూ.89,500 పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.