Gold Rates Hike | దీపావళి రోజున పేలిన గోల్డ్ బాంబ్..! ఇప్పట్లో తగ్గేలేలా లేదుగా..!
Gold Rates Hike | పసిడి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరుగుతూ వస్తున్న ధరలు తగ్గుముఖం పట్టేలా లేవు. ఇటీవల వరుసగా ధరలు పెరుగుతూ జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. దీంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.

Gold Rates Hike | పసిడి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరుగుతూ వస్తున్న ధరలు తగ్గుముఖం పట్టేలా లేవు. ఇటీవల వరుసగా ధరలు పెరుగుతూ జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. దీంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా బులియన్ మార్కెట్‌లో దీపావళి పండుగైన గురువారం రోజున మరోసారి ధర పెరిగింది. 22 గోల్డ్‌పై రూ.150 పెరిగి.. తులానికి రూ.74,550కి ఎగిసింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.81,330 పెరిగింది. మరో వైపు పసిడి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని వివిధ నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల పసిడి రూ.74,700 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.81,480కి ఎగిసింది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం రూ.74,550 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.81,330 ధర పలుకుతున్నది. చెన్నై నగరంలో 22 క్యారెట్స్ బంగారం రూ.74,550 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.81,330కి పెరిగింది.
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ.74,550 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.81,330 ధర పలుకుతున్నది. అలాగే, ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.లక్ష పలుకుతున్నది. హైదరాబాద్‌లో రూ.1,09,000 వద్ద ట్రేడువుతున్నది. అయితే, ఇటీవల బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్ష ఎన్నికలు కారణంగా పేర్కొంటున్నారు. ఈ సారి అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా సాగనున్నాయి. ట్రంప్, కమలా హారిస్‌లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొన్నది. ఎన్నికల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో మదుపరులు బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. ఎందుకంటే బంగారం పెట్టుబడి సురక్షితంగా భావిస్తుంటారు. ఈ క్రమంలో ధరలు పెరుగుతున్నట్లు మార్కెట్ పండితులు పేర్కొంటున్నారు.