Gold Rates | బంగారం కొనుగోలుదారులకు రిలీఫ్‌.. తగ్గుముఖం పట్టిన ధరలు..!

Gold Rates | బంగారం ధరలు కొనుగోలుదారులకు రిలీఫ్‌ ఇచ్చాయి. బులియన్‌ మార్కెట్‌లో మంగళవారం ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. 22 క్యారెట్ల బంగారం తులానికి రూ.100 తగ్గి తులానికి రూ.66,600కి తగ్గింది.

Reported by: Mallanna | వాణిజ్యం | Aug 20, 2024, 11:06 am IST
Read Time: 3 mins
Gold Rates | బంగారం కొనుగోలుదారులకు రిలీఫ్‌.. తగ్గుముఖం పట్టిన ధరలు..!

Gold Rates | బంగారం ధరలు కొనుగోలుదారులకు రిలీఫ్‌ ఇచ్చాయి. బులియన్‌ మార్కెట్‌లో మంగళవారం ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. 22 క్యారెట్ల బంగారం తులానికి రూ.100 తగ్గి తులానికి రూ.66,600కి తగ్గింది. 24 క్యారెట్ల స్వర్ణం తులానికి రూ.120 తగ్గి రూ.72,770 పలుకుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో బంగారం 22 క్యారెట్ల తులానికి రూ.65,700 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.72,650కి తగ్గింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.68,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,800 పలుకుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.66,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,650కి పెరిగింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.66,600 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.72,650 పలుకుతున్నది.

ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర స్వల్పంగా పెరిగింది. ఢిల్లీలో కిలోకు రూ.87వేలు పలుకుతున్నది. హైదరాబాద్‌లో కిలోకు రూ.92వేలకు పెరిగింది. బంగారం, వెండి ధరలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నుల ఆధారంగా ధర మారుతూ వస్తుంది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.