Gold Rates | పండుగ రోజే మగువలకు షాక్‌ ఇచ్చిన పసిడి.. భారీగా పెరిగిన ధర

Gold Rates | బతుకమ్మ పండుగ రోజే పసిడి ధరలు మగువలకు షాక్‌ ఇచ్చాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు బుధవారం బులియన్‌ మార్కెట్‌లో ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల ధరలు భారీగా పెరుగుతూ రికార్డు స్థాయికి చేరాయి. వరుసగా పెరుగుతున్న ధరలతో జనం ఆందోలనకు గురవుతున్నారు.

Reported by: Mallanna | వాణిజ్యం | Oct 02, 2024, 10:03 am IST
Read Time: 3 mins
Gold Rates | పండుగ రోజే మగువలకు షాక్‌ ఇచ్చిన పసిడి.. భారీగా పెరిగిన ధర

Gold Rates | బతుకమ్మ పండుగ రోజే పసిడి ధరలు మగువలకు షాక్‌ ఇచ్చాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు బుధవారం బులియన్‌ మార్కెట్‌లో ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల ధరలు భారీగా పెరుగుతూ రికార్డు స్థాయికి చేరాయి. వరుసగా పెరుగుతున్న ధరలతో జనం ఆందోలనకు గురవుతున్నారు. 22 క్యారెట్ల బంగారంపై రూ.500 పెరిగి.. తులానికి రూ.71వేలకు పెరిగింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.540 పెరిగి తులానికి రూ.77,450కి పెరిగి రికార్డు స్థాయికి చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో బంగారం 22 క్యారెట్ల తులానికి రూ.71వేలు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.77,450 పెరిగింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.71,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.77,600 ఎగిసింది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.71వేలు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.77,450కి చేరింది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.71వేలు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.77,600 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు మిగతా అన్ని నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర సైతం స్థిరంగా ఉన్నది. ఢిల్లీలో రూ.95వేలు ఉనది. హైదరాబాద్‌లో కిలోకు రూ.1,01,000గా ఉన్నది. బంగారం, వెండి ధరలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నుల ఆధారంగా ధర మారుతూ వస్తుంది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.