Gold-Silver Down | బంగారం కొనుగోలుదారులకు ఊరట.. తగ్గిన పసిడి, వెండి ధరలు

Gold-Silver Down | పసిడిదారులకు కొనుగోలుదారులకు స్వల్ప ఊరటనిచ్చాయి. నిన్న భారీగా పెరగడంతో సరికొత్త జీవనకాల రికార్డులను నమోదు చేశాయి. తాజాగా మంగళవారం బులియన్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.600 తగ్గి తులానికి రూ.68,300కి పతనమైంది. 24 క్యారెట్ల బంగారం రూ.650 తగ్గి తులానికి రూ.74,510కి చేరింది.

Gold-Silver Down | బంగారం కొనుగోలుదారులకు ఊరట.. తగ్గిన పసిడి, వెండి ధరలు

Gold-Silver Down | పసిడిదారులకు కొనుగోలుదారులకు స్వల్ప ఊరటనిచ్చాయి. నిన్న భారీగా పెరగడంతో సరికొత్త జీవనకాల రికార్డులను నమోదు చేశాయి. తాజాగా మంగళవారం బులియన్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.600 తగ్గి తులానికి రూ.68,300కి పతనమైంది. 24 క్యారెట్ల బంగారం రూ.650 తగ్గి తులానికి రూ.74,510కి చేరింది. వెండిపై ఏకంగా రూ.1900 పతనమై కిలో రూ.94,600 తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.68,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.74,840కి పడిపోయింది.

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.68,300 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.74,510కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.68,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.74,660కి దిగివచ్చింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.68,300 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.74,510 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర భారీగా పతనమైంది. రూ.1900 వరకు తగ్గి.. ఢిల్లీలో కిలో రూ.94,600కి తగ్గింది.

ఇక హైదరాబాద్‌లో రూ.99వేల వద్ద ట్రేడవుతున్నది. నిన్న రికార్డు స్థాయిలో వెండిపై రూ.3వేలకుపైగా పెరగడంతో తొలిసారిగా వెండి రూ.లక్ష మార్క్‌ని దాటింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.