Gold-Silver Rates | మగువలకు తీపికబురు.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్‌..!

Gold-Silver Rates | మగువలకు గుడ్‌న్యూస్‌. బంగారం, వెండి ధరలు బులియన్‌ మార్కెట్‌లో సోమవారం తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.100 తగ్గి తులానికి రూ.66,250కి తగ్గింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.150 పతనమై తులానికి రూ.72,230కి చేరింది.

Reported by: Mallanna | వాణిజ్యం | Jun 24, 2024, 10:28 am IST
Read Time: 3 mins
Gold-Silver Rates | మగువలకు తీపికబురు.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్‌..!

Gold-Silver Rates | మగువలకు గుడ్‌న్యూస్‌. బంగారం, వెండి ధరలు బులియన్‌ మార్కెట్‌లో సోమవారం తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.100 తగ్గి తులానికి రూ.66,250కి తగ్గింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.150 పతనమై తులానికి రూ.72,230కి చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.67వేలు పలుకుతున్నది. 24 క్యారెట్ల బంగారం రూ.73,100కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.66,250 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.72,230కి తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.66,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,380కి పతనమైంది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.66,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.72,230 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి సైతం దిగి వచ్చింది. ఢిల్లీలో కిలో వెండి రూ.91,700 ఉండగా.. ఇక హైదరాబాద్‌లో రూ.96,200కి తగ్గింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.