పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో తీవ్ర హెచ్చు తగ్గులకు గురవుతున్న బంగారం, వెండి ధరలు మరోసారి భారీ తగ్గుదలను నమోదు చేశాయి. మంగళవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 750 తగ్గి రూ. 1,44,170లకు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,550 తగ్గి రూ. 1,32,150ల వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ. 5,000 తగ్గి రూ. 2,35,000ల వద్ద కొనసాగుతుంది.
కొనుగోలుకు మంచి ఛాన్స్
పెట్టుబడిదారులు, ట్రేడర్లు లాభాల పసిడిపై పెట్టిన పెట్టుబడులపై లాభార్జనకు మొగ్గు చూపడంతో పాటు సరఫరా కొరత, డాలర్ విలువ పెంపు వంటి పరిణామాల మధ్య బంగారం ధరలు మరోసారి దిగి వచ్చాయి. ప్రస్తుత ధరలు కొనుగోలుకు మంచి ఛాన్స్ గా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు ఇప్పటికిప్పుడు భారీగా పెరుగకపోయినప్పటికి తగ్గుదలకు కూడా పెద్దగా ఉండబోదని..ధరలను గమనిస్తూ కొద్దికొద్దిగా కొనుగోలు చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
