బంగారం, వెండి పరుగులు..మరింత పైకి ధరలు

బులియన్ మార్కెట్ లో సోమవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం, ధర రూ. 880 పెరిగి రూ. 1,63,970కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 800 పెరిగి రూ. 1,50,300వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ. 5,000 పెరిగి రూ. 2,75,000 వద్ద కొనసాగుతుంది.

విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక మార్పుల క్రమంలో బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. ఆగస్టు నెలలో వరుస పెరుగుదలను నమోదు చేస్తున్న బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. బులియన్ మార్కెట్ లో సోమవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం, ధర రూ. 880 పెరిగి రూ. 1,63,970కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 800 పెరిగి రూ. 1,50,300వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ. 5,000 పెరిగి రూ. 2,75,000 వద్ద కొనసాగుతుంది.

మరింత పెరుగనున్న బంగారం, వెండి ధరలు

అమెరికా ద్రవ్యోల్భణం, డాలర్ బలహినత, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో మార్పులు, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్ల పెంపు వంటి కారణాల మధ్య బంగారం ధరలు రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు లేదా తగ్గదుల నిర్ణయాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆర్థిక నిపుణులు రాబర్ట్ కియోసాకి రానున్న నెలల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేశారు. మరికొందరు నిపుణులు మరోసారి తులం బంగారం ధర రూ. 2లక్షల మార్కును తాకవచ్చని చెబుతున్నారు. భారత్ లో శుభాకార్యాలు, పండగ సీజన్ తో పాటు దిగుమతి సుంకాల వంటి అంశాల ప్రభావంతో ధరలు పెరుగువచ్చని అంచనా వేస్తున్నారు.

Latest News