Expensive Cities | ఇక్కడ ఫ్లాట్ రేటు యమ కాస్ట్‌లీ గురూ..! గజం ఏకంగా రూ.30లక్షలు మరి..!
Expensive Cities | మనం ఎక్కడా ఫ్లాట్ కొనుగోలు చేద్దామనుకుంటే చదరపు గజానికి రూ.10 నుంచి రూ.30వేల వరకు పలుకుతుంది. మరీ మంచి ఏరియాల్లో ఒక్కోసారి గజం రూ.50 నుంచి అంతకుపైగానే ఉంటుంది. మరి చదరపు గజానికి రూ.15లక్షల నుంచి రూ.30లక్షల వరకు పెట్టాల్సి వస్తే ఎలా ఉంటుంది. వామ్మో అనిపిస్తుంది కదూ..? ఈ క్రమంలో ప్రపంచవ్యాప్త ప్రఖ్యాత హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ ఇటీవల ప్రపంచంలోనే ఖరీదైన నగరాల జాబితాను విడుదల చేసింది.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని ప్రధాన నగరాలను ఎంపిక చేసుకొని.. ఆయా నగరాల్లోని కీలకమైన ప్రాంతాలు, ఏరియాలో కనీసం 200 చదరపు మీటర్లకుపైన విస్తీర్ణం ఉన్న ప్లాట్ల రేట్లను పరిగణలోకి తీసుకున్నారు. ఈ వివరాలతో ఖరీదైన నగరాల జాబితాను తయారు రూపొందించింది. జాబితాలో మొనాకో దేశం మొదటి స్థానంలో నిలిచింది. మొనాకో సిటీలో ఫ్లాట్ ఖరీదు అక్షరాల రూ.29.64లక్షల ధర పలుకుతున్నది. ఆ తర్వాత అమెరికా న్యూయార్క్ సిటీలో రూ.23.71 లక్షలుగా ఉన్నది. మూడోస్థానంలో యూకేలోని లండన్‌లో రూ.22.13లక్షలు.. 4వ స్థానంలో హాంకాంగ్ సిటీ నిలిచింది. ఇక్కడ ఫ్లాట్ ఖరీదు రూ.21.54 లక్షలుగా ఉన్నది.
ఇక ఐదోస్థానంలో ఫ్రాన్స్‌లోని సెయింట్ జీన్ కేప్ ఫెరాట్‌లో రూ. 20.87లక్షలు, 6వ స్థానంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో రూ. 18.95లక్షలు, 7వ స్థానంలో ఫ్రాన్స్‌లోని ప్యారిస్ నగరంలో రూ.15.36లక్షలు, 8వ స్థానంలో అమెరికా లాస్ ఏంజిలిస్‌లో రూ. 14.86లక్షలుగా ఉన్నాయి. 9వ స్థానంలో అమెరికా పామ్ బీచ్ సిటీలో రూ.14.61లక్షలు.. 10వ స్థానంలో అమెరికా మియామీ బీచ్ ఏరియాలో రూ.14.66లక్షలు పలుకుతున్నది. ఆ తర్వాత సింగపూర్, అమెరికాలోని ది బే ఏరియా, ఫ్రాన్స్ నైస్, స్విట్జర్లాండ్‌లోని జెనీవా, ఫ్రాన్స్‌లోని కేన్స్, సెయింట్ ట్రోపెజ్, యాంటిబ్స్, ఇటలీలోని పొర్టోఫినో, జపాన్‌లోని టోక్యో నగరం, స్విట్జర్లాండ్ లుగానో సిటీలు నిలిచాయి. ఆయా సిటీల్లో చదరపు గజం విలువ రూ.12లక్షలుపైగానే పలుకుతున్నది.