Sanda Island | అమ్మకానికి సిద్ధంగా సాండా దీవి..! రేటు జస్ట్‌ రూ.26కోట్లే..!

Sanda Island | సొంతంగా ఓ దీవిని కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? ప్రశాంతంగా ఆ దీవిలో లైఫ్‌ను ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నారా..? అయితే.. మీకో శుభవార్త. ఓ దీవి అమ్మకానికి ఉన్నది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ స్కాట్లాండ్ పశ్చిమ తీరంలో సాండా దీవిని నైట్ ఫ్రాంక్ ప్రాపర్టీస్ సంస్థ అమ్మకానికి పెట్టింది.

Sanda Island | అమ్మకానికి సిద్ధంగా సాండా దీవి..! రేటు జస్ట్‌ రూ.26కోట్లే..!

Sanda Island | సొంతంగా ఓ దీవిని కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? ప్రశాంతంగా ఆ దీవిలో లైఫ్‌ను ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నారా..? అయితే.. మీకో శుభవార్త. ఓ దీవి అమ్మకానికి ఉన్నది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ స్కాట్లాండ్ పశ్చిమ తీరంలో సాండా దీవిని నైట్ ఫ్రాంక్ ప్రాపర్టీస్ సంస్థ అమ్మకానికి పెట్టింది. 453 ఎకరాల మేర విస్తరించి ఉన్న సాండా దీవిలో ఏడు ఇండ్లతో పాటు ఓ చిన్న పబ్‌ సెటప్‌ సైతం ఉన్నది. హెలీకాప్టర్‌ ల్యాండ్‌ అయ్యేందుకు వీలుగా ఓ హెలీప్యాడ్‌ సైతం ఉన్నది. ఈ దీవిలో చిన్నపాటి బీచ్‌ సైతం ఉంటుంది. పక్కనే రెండు చిన్న దీవులు సైతం ఉన్నాయి.

ఆ రెండు దీవులను సైతం సాండా దీవితో కలిపి ఇచ్చేస్తామని కంపెనీ పేర్కొంది. ఈ దీవుల్లో ఒక దానిపై లైట్‌హైస్‌ ఉండడం విశేషం. ఇక్కడ ఒక చిన్న గొర్రెల ఫామ్ సైతం ఉన్నది. అందులో 55 గొర్రెలు ఉన్నాయని తెలిపింది. సముద్ర పక్షులు, ఇతర జంతువులు సైతం దీవుల్లో ఆవాసాన్ని ఏర్పాటు చేసుకొని మనుగడ సాగిస్తున్నాయని కంపెనీ పేర్కొంది. ఉత్తర ఐర్లాండ్‌ నుంచి బోటులో ఈ దీవికి చేరుకోవచ్చని చెప్పింది. ఉత్తర ఐర్లాండ్‌లోని టౌన్‌ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని నైట్‌ ఫ్రాంక్‌ సంస్థ చెప్పింది. ఇక ధర విషయానికి వస్తే.. దీవిని 31 మిలియన్‌ పౌండ్లకు విక్రయించనున్నట్లు పేర్కొంది. భారతీయ కరెన్సీలో అక్షరాలా రూ.26కోట్లుగా కంపెనీ పేర్కొంది.