Maruti Suzuki Victoris | 5-స్టార్ భద్రతా రేటింగ్‌తో, అడాస్ ఫీచర్లతో మారుతి సుజుకి విక్టోరిస్ SUV ఆవిష్కరణ

మారుతి సుజుకి విక్టోరిస్ SUVను ఆవిష్కరించింది. 5-స్టార్ Bharat NCAP రేటింగ్, Level-2 ADAS, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్, ప్రీమియం ఫీచర్లతో Victoris దేశీయంగానే కాకుండా 100 దేశాలకు ఎగుమతికీ సిద్ధమైంది. Hyundai Creta, Kia Seltos ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ, Maruti Suzuki మిడ్-సైజ్ SUV విభాగంలో తన స్థానాన్ని బలపరచాలన్న లక్ష్యంతో Victorisను ముందుకు తెచ్చింది.

Maruti Suzuki Victoris | 5-స్టార్ భద్రతా రేటింగ్‌తో, అడాస్ ఫీచర్లతో మారుతి సుజుకి విక్టోరిస్ SUV ఆవిష్కరణ

Maruti Suzuki Victoris | భారతదేశంలో మిడ్-సైజ్ SUV విభాగంలో తీవ్ర పోటీ నడుస్తున్న వేళ, Maruti Suzuki తన కొత్త ఫ్లాగ్‌షిప్ Arena SUV – Victorisను ఆవిష్కరించింది. Brezza కన్నా ఎగువన నిలిచే ఈ మోడల్, Grand Vitaraకి తోడుగా Maruti Suzukiకి ఇది డబుల్ధమాకాలా  కనిపిస్తోంది. “Got It All” ట్యాగ్‌లైన్‌తో మార్కెట్‌లోకి దిగిన Victoris, 5-Star Bharat NCAP రేటింగ్, Level-2 ADAS, మల్టిపుల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు మరియు అత్యాధునిక ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఇది కేవలం దేశీయ మార్కెట్‌కి మాత్రమే కాదు, 100 దేశాలకు ఎగుమతి చేయబోతున్న గ్లోబల్ కారు కూడా.

విక్టోరిస్: డిజైన్ & ఇంటీరియర్

Victorisలో డిజైన్ విభాగం e-Vitara ప్రేరణతో రూపొందించబడింది. ముందు భాగంలో స్లీక్ LED హెడ్‌ల్యాంప్స్, కనెక్టెడ్ టెయిల్‌ల్యాంప్స్, 17-అంగుళాల ఆలాయ్ వీల్స్, డ్యూయల్-టోన్ ఆప్షన్లతో SUV స్పోర్టీ లుక్ కల్పించింది. ఇంటీరియర్‌లో బ్లాక్-ఐవరీ డ్యుయల్ టోన్ డాష్‌బోర్డ్, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1-అంగుళాల SmartPlay Pro X టచ్‌స్క్రీన్, Infinity 8-స్పీకర్ డాల్బీ ఆట్మాస్ సిస్టమ్ ఉన్నాయి. అదనంగా, పానోరమిక్ సన్‌రూఫ్, గెస్చర్​ కంట్రోల్ టెయిల్‌గేట్, వెంటిలేటెడ్ సీట్స్, 64-కలర్ అంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

భద్రత ప్రథమం: 5-స్టార్ రేటింగ్ + ADAS

Maruti Suzuki victoris SUV launched

ఎప్పుడూ భద్రతపై ప్రశ్నలు ఎదుర్కొనే Maruti Suzuki, Victorisతో తన రూట్​ మార్చింది. Bharat NCAPలో 5-Star రేటింగ్ సాధించిన Victoris, స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్స్, ESP, ABS-EBD, TPMS, హిల్ హోల్డ్ అసిస్ట్ కలిగి ఉంది.

భారతీయ మార్కెట్లో మొదటిసారిగా Arena మోడల్‌లో Level-2 ADASని Maruti అందించింది. ఇందులో:

  • Adaptive Cruise Control (curve speed reductionతో)
  • Lane Keep Assist
  • Automatic Emergency Braking
  • Blind Spot Monitor + Lane Change Alert
  • Rear Cross Traffic Alert
  • High Beam Assist

లాంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా 360-డిగ్రీ కెమెరా, అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి భద్రతా సదుపాయాలు ఉన్నాయి.

పవర్‌ట్రెయిన్‌లు & మైలేజ్

Victorisలో రెండు ప్రధాన పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు:

  • 1.5L NA పెట్రోల్ (103hp, 139Nm) → 5MT / 6AT గేర్లతో, CNG ఆప్షన్, AWD సిస్టమ్ కూడా.
    • Mileage: 21.18 km/l (MT), 21.06 km/l (AT), 19.07 km/l (AWD), 27.02 km/kg (CNG).
  • 1.5L Strong Hybrid (92.5hp, 122Nm) → e-CVT ట్రాన్స్‌మిషన్.
    • Mileage: 28.65 km/l (best-in-class).

గ్లోబల్ లక్ష్యాలు

Victorisను Arena ఛానల్ ద్వారా విక్రయించబోతున్నారు. Grand Vitara Nexa డీలర్‌షిప్ ద్వారా కొనసాగుతుంది. దీంతో Maruti Suzuki రెండు వేర్వేరు సేల్స్ నెట్‌వర్క్‌లను ఉపయోగించి మాస్ మార్కెట్ + ప్రీమియం కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంటోంది.

కేవలం దేశీయంగానే కాకుండా Victorisను 100 దేశాలకు ఎగుమతి చేయాలని Maruti Suzuki ప్రణాళిక వేస్తోంది. ఇది Suzuki Motor Corporationకి భారత్​ ఒక SUV ఎగుమతి హబ్‌గా మారనుందని స్పష్టంగా సూచిస్తోంది.

 

Maruti Suzuki Victoris, భద్రతా ప్రమాణాలు, ప్రీమియం ఫీచర్లు, మల్టిపుల్ పవర్‌ట్రెయిన్‌లతో మిడ్-సైజ్ SUV సెక్టార్‌లో కొత్త పోటీని తెచ్చింది. Hyundai Creta, Kia Seltos ఆధిపత్యాన్ని బద్దలు కొట్టాలన్న Maruti Suzuki వ్యూహంలో Victoris కీలక పాత్ర పోషించనుంది.