Flash pay | కీ చైన్‌తో చెల్లింపులు.. ఫ్లాష్ పే పేరుతో ఫెడరల్ బ్యాంక్ రూపే స్మార్ట్ కీ..!
Flash pay : ప్రైవేటు రంగానికి చెందిన ఫెడరల్ బ్యాంక్ (Federal Bank) ఫ్లాష్ పే (flash pay) పేరుతో రూపే స్మార్ట్ కీ చైన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ కీ చైన్‌తో కాంటాక్ట్ లెస్ చెల్లింపులు చేయొచ్చు. ప్రస్తుత క్రెడిట్/ డెబిట్ కార్డుల్లో ఉన్న ట్యాప్ అండ్ పే ఫీచర్ తరహాలోనే ఇది పని చేస్తుంది.
Flash pay : ప్రైవేటు రంగానికి చెందిన ఫెడరల్ బ్యాంక్ (Federal Bank) ఫ్లాష్ పే (flash pay) పేరుతో రూపే స్మార్ట్ కీ చైన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ కీ చైన్‌తో కాంటాక్ట్ లెస్ చెల్లింపులు చేయొచ్చు. ప్రస్తుత క్రెడిట్/ డెబిట్ కార్డుల్లో ఉన్న ట్యాప్ అండ్ పే ఫీచర్ తరహాలోనే ఇది పని చేస్తుంది. అంటే ఈ చిన్న కీ చైన్ మీవెంట ఉంటే సులువుగా పేమెంట్స్ చేయొచ్చు. రూ.5 వేల వరకు పిన్ ఎంటర్ చేయకుండానే కాంటాక్ట్ లెస్ పేమెంట్లు జరపవచ్చు.
రూ.5 వేల కంటే పైన మొత్తాలకు పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పీఓఎస్ మెషిన్ల వద్ద ఒకరోజు గరిష్ఠంగా రూ.లక్ష వరకు చెల్లింపు చేయొచ్చు. ఫ్లాష్ పే రూపే స్మార్ట్ కీ చైన్ ఉంటే బయటకు వెళ్లినప్పుడు క్రెడిట్, డెబిట్ కార్డు పట్టుకెళ్లాల్సిన అవసరం ఉండదని బ్యాంక్ పేర్కొంది. ఎన్‌పీసీఐతో కలిసి దీన్ని తీసుకొచ్చినట్లు తెలిపింది.
ఎలా తీసుకోవాలి?
- ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లకు ఈ రూపే స్మార్ట్ కీని జారీ చేస్తారు. సేవింగ్స్/ కరెంట్ ఖాతా ఉన్నవారు నెట్ బ్యాంకింగ్‌లోకి వెళ్లి ఈ స్మార్ట్ కీ చైన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
- ఫెడరల్ బ్యాంక్ మొబైల్ యాప్, నెట్ బ్యాంకింగ్, ఐవీఆర్ కాలింగ్ ద్వారా పిన్ సెట్ చేసుకోవచ్చు.
- క్రెడిట్/ డెబిట్ కార్డు తరహాలోనే ఏ క్షణంలోనైనా దీన్ని బ్లాక్ చేసుకోవచ్చు. అన్‌బ్లాక్ చేసుకోవచ్చు.
- ఈ స్మార్ట్ కీ చైన్ ధరను బ్యాంక్ రూ.499గా బ్యాంక్ నిర్ణయించింది. ఆ తర్వాత ఏడాదికి రూ.199 చొప్పున చార్జి చేస్తారు. పన్నులు అదనం.
- టెర్మినల్‌కు 3 నుంచి 4 సెంటీమీటర్ల దూరం పేమెంట్లు చేయొచ్చు. రోజులో ఐదు లావాదేవీలకు అనుమతిస్తారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram