Paytm | కొత్త ఫీచర్ తీసుకొచ్చిన పేటీఎం..! చెల్లింపులు మరింత తేలిగ్గా..!
Paytm | ఇటీవల కాలంలో భారతదేశంలో ఆన్‌లైన్ చెల్లింపులు భారీగా పెరిగాయి. యూపీఐ చెల్లింపులు ఆన్‌లైన్ చెల్లింపుల్లో ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. అయితే, యూపీఐ చెల్లింపులు చేసే సమయంలో తప్పనిసరిగా ఇంటర్‌నెట్ అవసరం ఉంటుంది. అయితే, పలు సందర్భాల్లో పేమెంట్స్ చేసే సమయంలో నెట్‌వర్క్ లేక ఇబ్బందులుపడుతున్నారు. దాంతో పిన్ అవసరం లేకుండా చిన్న చిన్న పేమెంట్స్‌నే చూసేలా ఇప్పటికే ఎన్నో కంపెనీలు యూపీఐ లైట్ సేవలను తీసుకువచ్చాయి.

Paytm | ఇటీవల కాలంలో భారతదేశంలో ఆన్‌లైన్ చెల్లింపులు భారీగా పెరిగాయి. యూపీఐ చెల్లింపులు ఆన్‌లైన్ చెల్లింపుల్లో ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి. అయితే, యూపీఐ చెల్లింపులు చేసే సమయంలో తప్పనిసరిగా ఇంటర్‌నెట్ అవసరం ఉంటుంది. అయితే, పలు సందర్భాల్లో పేమెంట్స్ చేసే సమయంలో నెట్‌వర్క్ లేక ఇబ్బందులుపడుతున్నారు. దాంతో పిన్ అవసరం లేకుండా చిన్న చిన్న పేమెంట్స్‌నే చూసేలా ఇప్పటికే ఎన్నో కంపెనీలు యూపీఐ లైట్ సేవలను తీసుకువచ్చాయి. తాజాగా ప్రముఖ కంపెనీ పేటీఎం సైతం యూపీఐ లైట్ సేవలను తీసుకువచ్చింది. పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ యూపీఐ లైట్ వాలెట్‌పై దృష్టి సారించింది. ఈ పేటీఎం యూపీఐ లైట్ వాలెట్ సహాయంతో రూ.500 వరకు లావాదేవీలు చేసేందుకు అనుమతి ఉంటుంది. వినియోగదారులు రోజుకు రెండుసార్లు రూ.2వేల చొప్పున వ్యాలెట్‌లో డబ్బులు యాడ్ చేసుకోవచ్చు. రూ.4వేలు కిరాణా సామాగ్రి, పార్కింగ్, ప్రయాణ ఛార్జీలను తదితర చెల్లింపులు చేసేందుకు ఉపయోగపడనున్నది.
ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..
మొదట పేటీఎం యాప్‌ని ఓపెన్ చేసి హోం పేజీలో యూపీఐ లైట్ యాక్టివేట్ సింబల్‌పై ప్రెస్ చేయాలి. ఆ తర్వాత యూపీఐ లైట్‌కి కావాల్సిన బ్యాంక్ ఖాతాను ఎంచుకోవాలి. లావాదేవీల కోసం మీరు యూపీఐ లైట్‌కు జోడించాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. మీ యూపీఐ లైట్ ఖాతాను సృష్టించడానికి ఎంపిన్‌ను ధ్రువీకరించుకోవాలి. ఆ తర్వాత యూపీఐ లైట్ ఖాతా ఇప్పుడు సులభమైన వన్-ట్యాప్ చెల్లింపుల కోసం సెటప్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఏదైనా యూపీఐ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయచ్చు. లేదంటే మొబైల్ నంబర్‌ను నమోదు చేసేందుకు అవకాశం ఉంటుంది. వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL), యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), యస్ బ్యాంక్ వంటి టాప్ పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్స్ (పీఎస్‌పీ) మధ్య సహకారం పేటీఎం సేవలు అందిస్తున్నది.