Sensex Open Bell | నేడు పార్లమెంట్‌లో బడ్జెట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..!
Sensex Open Bell | దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలతో మార్కెట్లు ఉదయం లాభాల్లో మొదలయ్యాయి. అదే సమయంలో పార్లమెంట్‌లో ఉదయం 11గంటలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Sensex Open Bell | దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలతో మార్కెట్లు ఉదయం లాభాల్లో మొదలయ్యాయి. అదే సమయంలో పార్లమెంట్‌లో ఉదయం 11గంటలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో మార్కెట్లు రాణిస్తున్నాయి. ఉదయం గంటల సమయంలో 80,724.30 పాయింట్లు, నిఫ్టీ 24,568.90 వద్ద లాభాల్లో మార్కెట్లు మొదలయ్యాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.64 వద్ద ప్రారంభమైంది.
ఆ తర్వాత అరగంటలకే మార్కెట్లు పతనమయ్యాయి. మరో వైపు సోమవారం మార్కెట్లు లాభాల్లో ముగియగా.. ఇవాళ ఆసియా మార్కెట్లు సైతం లాభాల బాటలో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 82.42 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) రూ.3,444 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.1,652 కోట్ల వాటాలను విక్రయించారు. ప్రస్తుతం నిఫ్టీ 52.70 పాయింట్లు పతనమై.. 24,456.05 వద్ద కొనసాగుతున్నది. సెన్సెక్స్ 104.16 పాయింట్లు తగ్గి.. 80,379.80 వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీలో లారెన్స్, ఐచర్ మోటార్స్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్‌టీపీసీ లాభాల్లో కొనసాగుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్, హిందాల్కో, విప్రో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram