వెండి దిగుమతులపై కేంద్రం ఆంక్షలు
పశ్చిమాసియా యుద్దంతో భారత్ ఎదుర్కోంటున్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించే చర్యలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వెండి దిగుమతి విధానాన్ని ‘‘స్వేచ్ఛా విధానం నుంచి పరిమిత విధానంగా.. తక్షణమే సవరించినట్లు విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.
విధాత : పశ్చిమాసియా యుద్దంతో భారత్ ఎదుర్కోంటున్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించే చర్యలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వెండి దిగుమతి విధానాన్ని ‘‘స్వేచ్ఛా విధానం నుంచి పరిమిత విధానంగా.. తక్షణమే సవరించినట్లు విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ విధానంలో దిగుమతుల కోసం ప్రభుత్వ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.ముఖ్యంగా 99.9 శాతం లేదా అంతకంటే ఎక్కువ స్వచ్ఛత కలిగిన వెండి బార్ల దిగుమతిని ఫ్రీ నుంచి పరిమిత వర్గంలోకి మార్చింది.
ఫ్రీ విధానంలో ఎటువంటి ప్రత్యేక అనుమతులు లేకుండా దిగుమతి చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు పరిమిత వర్గంలో అయితే.. ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అవసరం అవుతుంది. దీని వల్ల వెండి దిగుమతులు నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది. విదేశీ వాణిజ్యం (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1992 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలతో వెండి దిగుమతుల విధానంలో ఈ కొత్త మార్పులు అమలు చేసినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఈ ఉత్తర్వులపై సంతకం చేశారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులకు కళ్లెం వేసేందుకు ఈ రెండు లోహాల దిగుమతులపై ఇప్పటికే సుంకాన్ని 6 నుంచి 15 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. విదేశాల నుంచి ఎక్కువగా బంగారం, వెండి కొనుగోలు చేస్తే దేశం నుంచి విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా బయటకు వెళ్తుంది. దీని వల్ల వాణిజ్య లోటు పెరుగుతుంది. ఇది రూపాయి విలువపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే దేశ ఆర్థిక స్థిరత్వం కోసం బంగారం, వెండి లోహాల దిగుమతులపై కేంద్రం ఆంక్షలను విధించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram