Aadhar | అప్‌డేట్ చేయని ఆధార్ కార్డులు జూన్ 14 తర్వాత పని చేయవా..? కార్లిటీ ఇచ్చిన UIDAI..!
Aadhar | ఆధార్‌కార్డు తీసుకొని పదేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అప్‌డేట్ చేయని కార్డులు జూన్ 14 తర్వాత పని చేయవని ప్రచారం జరుగుతున్నది. ఈ వార్తలను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఖండించింది.

Aadhar | ఆధార్‌కార్డు తీసుకొని పదేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అప్‌డేట్ చేయని కార్డులు జూన్ 14 తర్వాత పని చేయవని ప్రచారం జరుగుతున్నది. ఈ వార్తలను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఖండించింది. ఆధార్‌ని అప్‌డేట్ చేసుకోని వారంతా జూన్ 14లోగా ఉచితంగా అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. అయితే, గడువు ముగిసిన తర్వాత డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అప్‌డేట్ చేయని ఆధార్‌కార్డులు పని చేయకపోవడం అనేది ఏమాత్రం ఉండదని తేల్చిచెప్పింది. సోషల్ మీడియాలో వైరల్ వుతున్న తప్పుడు వార్తలను పట్టించుకోవద్దని ఉడాయ్ సూచించింది. ఆధార్ అప్‌డేట్ కోసం ఉడాయ్ వెబ్‌సైట్, లేకపోతే ఆధార్ కేంద్రాలను సందర్శించవచ్చని అధికారులు తెలిపారు. ఉడాయ్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా ఆధార్‌ని అప్‌డేట్ చేసుకునేందుకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆధార్ సెంటర్‌లో వివరాలు అప్‌డేట్ చేసుకునేందుకు రూ.50 చెల్లించాల్సి వస్తుంది.
ఆన్‌లైన్‌లో ఆధార్‌ని అప్‌డేట్ చేసుకోండి..?
- ఆధార్‌ని అప్‌డేట్ చేసుకునేందుకు myaadhaar.uidai.gov.in వెబ్‌సైట్‌లో వెళ్లాలి. ఆ తర్వాత ఆధార్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి.
- ఆధార్‌ని అప్‌డేట్ చేసుకోవడానికి ముందు ‘ప్రొసీడ్ టు అప్‌డేట్ అడ్రస్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ పేరు, ఇతర వివరాలను పేర్కొంటూ తగిన ధ్రువీకరణపత్రాలు అప్‌లోడ్ చేయాలి.
- అనంతరం చిరునామా నిరూపించేలా మరో ప్రతాన్ని అప్‌లోడ్ చేసి తర్వాత సబ్మిట్ చేయాలి.
- రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత ‘డాక్యుమెంట్ అప్‌డేట్’పై క్లిక్ చేయాలి. అప్పటికే ఉన్న వివరాలు తెరపై కనిపిస్తాయి. ఇందులో ఏవైనా సవరణలు చేయాలనుకుంటే చేసుకోవాలి. అన్నీ వివరాలు ఒకే అనుకుంటే నెక్ట్స్‌పై క్లిక్ చేయాలి.
- అనంతరం డ్రాప్‌డౌన్ లిస్ట్ నుంచి ‘ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్’ డాక్యుమెంట్లను ఎంచుకోవాలి.
- ఆయా డాక్యుమెంట్ల స్కాన్డ్ కాపీలను అప్‌లోడ్ చేసి సబ్మిట్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత 14 అంకెల ‘అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్’ వస్తుంది. దాంతో అప్‌డేట్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.
- ఏమైనా ఇబ్బందులు తలెత్తితే టోల్ ఫ్రీ 1947 నంబర్‌లో సంప్రదింవచ్చు.
- ఆన్‌లైన్‌లో ఉచితంగా పేరు, చిరునామా, పుట్టిన తేదీ, వయసు, లింగం, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్, రిలేషన్‌షిప్ స్టేటస్ మార్చుకోవచ్చు.