Senior Citizens | సీనియర్‌ సిటిజన్లకు కేంద్రం తీపికబురు చెబుతుందా..? రైలు టికెట్ల సబ్సిడీపై బడ్జెట్‌లో ఏమైనా ప్రకటన వస్తుందా?

Senior Citizens | దేశంలోనే అతిపెద్ద ప్రజారవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. నిత్యం కోట్లాది మంది ప్రయాణికులను రైల్వేశాఖ గమ్యస్థానాలకు చేరవేస్తున్నది. భద్రతో పాటు తక్కువ ధర ఉండడంతో జనం రైల్వేలను ఆశ్రయిస్తుంటారు. ప్రస్తుతం అందరి దృష్టిలో మంగళవారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు.

Senior Citizens | సీనియర్‌ సిటిజన్లకు కేంద్రం తీపికబురు చెబుతుందా..? రైలు టికెట్ల సబ్సిడీపై బడ్జెట్‌లో ఏమైనా ప్రకటన వస్తుందా?

Senior Citizens | దేశంలోనే అతిపెద్ద ప్రజారవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. నిత్యం కోట్లాది మంది ప్రయాణికులను రైల్వేశాఖ గమ్యస్థానాలకు చేరవేస్తున్నది. భద్రతో పాటు తక్కువ ధర ఉండడంతో జనం రైల్వేలను ఆశ్రయిస్తుంటారు. ప్రస్తుతం అందరి దృష్టిలో మంగళవారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో రైల్వే ప్రయాణికులు చాలానే ఆశలు పెట్టుకున్నారు. సీనియర్‌ సిటిజన్లు రైల్వేశాఖ బడ్జెట్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రైల్వేకు సంబంధించి ఎలాంటి అంశాలు ప్రాధాన్యం కల్పిస్తారా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రైల్వే ప్రయాణీకులకు ఈసారి చాలా అంచనాలున్నాయి. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లు ఆశలు పెట్టుకున్నారు. రైల్వే టికెట్ ధరల్లో సీనియర్ సిటిజన్లకు గతంలో రాయితీ ఇచ్చేవారు. కరోనా సమయంలో ఈ సబ్సిడీని తొలగించింది కేంద్ర ప్రభుత్వం.

కొన్నేళ్లుగా సబ్సిడీని పునరుద్ధరించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. 2019 వరకూ 60 ఏళ్లు దాటినవారికి టికెట్ డిస్కౌంట్ ఉండేది. కోవిడ్ మహమ్మారి కారణంగా అన్ని రకాల రాయితీలకు కేంద్రం మంగళం పాడింది. మళ్లీ ఇప్పటి వరకు రాయితీలను మళ్లీ ప్రారంభించలేదు. ఈ విషయంపై పార్లమెంట్‌లో చర్చకు వచ్చినా.. ఇప్పటికే రైల్వేశాఖ టికెట్లపై రాయితీపైనే ప్రయాణం కల్పిస్తున్నామని.. కొత్తగా సీనియర్‌ సిటిజన్లకు రాయితీ ఇవ్వలేమని గతంలో స్పష్టం చేసింది. . రైలులో ప్రయాణించే ప్రతి వ్యక్తికి రైల్వే సగటున 53 శాతం సబ్సిడీ ఇస్తుందని.. ఈ సబ్సిడీని ప్రయాణికులందరికీ నిరంతరం అందజేస్తున్నట్లు చెప్పింది. అయితే, ఇటీవల సబ్సిడీని మళ్లీ పునరుద్ధరించనున్నట్లు వార్తలు వస్తుండగా.. మరోసారి సీనియర్‌ సిటిజన్ల ఆశలు పెంచుకున్నారు. ఈ క్రమంలో బడ్జెట్‌పై అందరి ఆసక్తి నెలకొన్నది. గతంలో మాదిరిగానే సినియర్‌ సిటిజన్లకు 50శాతం డిస్కౌంట్ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.