WhatsApp | ఇక థర్డ్‌పార్టీకి చెప్పేసేయండి టాటా..! సరికొత్త నోట్‌ ట్రాన్స్‌స్క్రిప్ట్‌ తెచ్చిన వాట్సాప్‌..!

WhatsApp | ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసెజింగ్‌ యాప్‌ వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. ఈ ఆయా యూజర్లను ఆకట్టుకునేందుకు మెటా నేతృత్వంలోని కంపెనీ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ని తీసుకువస్తుంటుంది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది.

WhatsApp | ఇక థర్డ్‌పార్టీకి చెప్పేసేయండి టాటా..! సరికొత్త నోట్‌ ట్రాన్స్‌స్క్రిప్ట్‌ తెచ్చిన వాట్సాప్‌..!

WhatsApp | ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసెజింగ్‌ యాప్‌ వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. ఈ ఆయా యూజర్లను ఆకట్టుకునేందుకు మెటా నేతృత్వంలోని కంపెనీ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ని తీసుకువస్తుంటుంది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. గతకొంతకాలంగా టెస్టింగ్‌ దశలో ఉన్న ఇన్‌ చాట్‌ వాయిస్‌ నోట్‌ ట్రాన్స్‌స్క్రిప్ట్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై వాయిస్‌ ట్రాన్స్‌స్క్రిప్ట్‌ కోసం థర్డ్‌ పార్టీ యాప్‌పై ఆధారపడాల్సిన పని లేదు. గో టూ మెసెంజర్‌ యాప్‌ ఫీచర్‌ మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా చేస్తుంది. నోట్‌ ట్రాన్స్‌స్క్రిప్షన్‌ ఫీచర్‌ అందుబాటులోకి రాగా.. వాయిస్‌ నోట్స్‌ రాసేందుకు అవకాశం ఉంటుంది. ఫీచర్‌తో వాయిస్ నోట్‌లో ఏం చెప్పినా నోట్ చేసుకోవడం ద్వారా యూజర్ల సమయం మరింత ఆధారం కానున్నది.

కొత్తగా వచ్చిన ఆ ఫీచర్లో హిందీతో పాటు ఇతర భాషల్లో వాయిస్‌ నోట్‌ని ట్రాన్స్‌స్క్రిప్ట్‌ చేసే వకాశం ఉంటుంది. ఈ ఫీచర్‌ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా.. త్వరలోనే మిగతా యూజర్లకు సైతం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది. అలాగే, వెబ్‌ వెర్షన్‌లో అందుబాటులో లేదు. ఇంగ్లీష్, స్పానిష్, పోర్చుగీస్, రష్యన్, హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉండగా.. వినియోగదారులు ఆయా భాషల్లో వాయిస్‌ నోట్స్‌ రాసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్‌ని యాక్టివేట్‌ చేసుకునేందుకు మొదట యాప్‌లోని సెట్టింగ్‌లోకి వెళ్లి చాట్‌పై క్లిక్‌ చేయాలి. ఫీచర్‌ని యాక్టివేట్‌ చేసేందుకు టోగుల్‌ బార్‌ కనిపిస్తుంది. యాక్టివేట్‌ చేసిన తర్వాత వాయిస్‌ నోట్స్‌ దిగువన ట్రాన్స్‌స్క్రిప్ట్‌ ప్రాంప్ట్‌ కనిప్తింది. వినియోగదారులు ప్రాసెస్‌ను మాన్యువల్‌గా ఎనేబుల్ చేసుకునే వీలుంటుంది. క్లిక్‌ చేసిన తర్వాత వాట్సాప్‌ టెక్స్‌ట్‌ ఫైల్‌ను డౌల్‌ చేస్తుంది.

అసలు వాయిస్‌ నోట కింద ట్రాన్స్‌స్క్రిప్షన్‌ రిజల్ట్‌ని డిస్‌ప్లే చేస్తుంది. వాయిస్ నోట్‌ను పొందిన తర్వాత మీరు వాయిస్ ట్రాన్స్‌క్రిప్షన్ చేస్తారా? లేదా ఆప్షన్ చూపిస్తుంది. ఫీచర్ యాక్టివ్ చేసిన తర్వాత మాత్రమే ఈ ఆప్షన్ కనిపిస్తుంది. ట్రాన్స్‌క్రిప్షన్ ఆప్షన్ క్లిక్ చేసే సమయంలో ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేస్తుంది. వాయిస్ నోట్‌లోని టెక్స్ట్ వాయిస్ నోట్ కింద కనిపిస్తుంది. వ్యక్తిగత వాయిస్ మెసేజ్‌లకు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో ప్రొటెక్షన్ ఉంటుంది. పంపినవారు, మెసేజ్ రిసీవ్‌ చేసుకునే వారు మాత్రమే వాట్సాప్‌ సైతం మెసేజ్‌లను వినదు.. చదవు. ట్రాన్స్‌స్క్రిప్ట్‌ ఫైల్‌ ప్రైవేట్‌, షేర్‌ చేయదని.. ప్రైవసీ ఫీచర్స్‌ని మరింత మెరుగుపరుచనున్నది. మరో వైపు వాట్సాప్‌ సరికొత్తగా డిఫాల్ట్‌ థీమ్‌పై పని చేస్తుంది. దాంతో డిఫాల్ట్ థీమ్‌ను ఎంచుకోవడానికి యూజర్లను అనుమతి ఉంటుంది. ఫోన్‌ సెట్టింగ్‌తో సంబంధం లేకుండా ఉంటుంది. ఇప్పటివరకు వాట్సాప్ థీమ్ ఫోన్ డిఫాల్ట్ థీమ్‌తో సింకరైజ్ అయి ఉంటుంది. ఈ ఫోన్ డార్క్ థీమ్‌లో ఉంటే.. యాప్ డార్క్‌గా మారుతుంది. ఫోన్ సెట్టింగ్ లైట్ థీమ్‌లో ఉంటే.. వాట్సాప్ సైతం అదే థీమ్‌ను డిస్‌ప్లే చేస్తుంది.