ఇంగ్లీష్ సినిమాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపుతున్న సితారా..!

విధాత‌: ప్రిన్స్ మ‌హేష్ బాబు గారాల ప‌ట్టి సితార సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌కుండానే అశేష‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. సోష‌ల్ మీడియాలో ఈ చిన్నారికి ఫాలోవ‌ర్స్ చాలా మందే ఉన్నారు. సితార‌కు సంబంధించిన వీడియో ఏదైన బ‌య‌ట‌కు వచ్చిందంటే అది నిమిషాల్లో వైర‌ల్ అవుతుంది. అయితే సితార వెండితెర ఎంట్రీ గురించి అభిమానుల్లో చాలా సందేహాలు ఉన్నాయి. వాటిపై తాజాగా క్లారిటీ ఇచ్చాడు మ‌హేష్ బాబు. ఇటీవ‌లే ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మ‌హేష్‌ని.. సితారకు సినిమాలు చేసే […]

ఇంగ్లీష్ సినిమాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపుతున్న సితారా..!

విధాత‌: ప్రిన్స్ మ‌హేష్ బాబు గారాల ప‌ట్టి సితార సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌కుండానే అశేష‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. సోష‌ల్ మీడియాలో ఈ చిన్నారికి ఫాలోవ‌ర్స్ చాలా మందే ఉన్నారు. సితార‌కు సంబంధించిన వీడియో ఏదైన బ‌య‌ట‌కు వచ్చిందంటే అది నిమిషాల్లో వైర‌ల్ అవుతుంది. అయితే సితార వెండితెర ఎంట్రీ గురించి అభిమానుల్లో చాలా సందేహాలు ఉన్నాయి. వాటిపై తాజాగా క్లారిటీ ఇచ్చాడు మ‌హేష్ బాబు.

ఇటీవ‌లే ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మ‌హేష్‌ని.. సితారకు సినిమాలు చేసే ఆస‌క్తి ఉందా? అని ప్ర‌శ్నించారు.దానికి మ‌హేష్‌.. తెలుగు సినిమాలు చేసేందుకు ఆస‌క్తి చూప‌డం లేదు.ఆమెకు ఇంగ్లీష్ సినిమాలు చేయాలని ఉంది. ఆమె తెలుగులో ఫ్రోజెన్ కు డబ్బింగ్ చెప్పింది. వారు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారు అనే విషయాన్నే వాళ్ళకే వదిలిపెట్టాము.

తెలుగులో చేస్తే ఫ్రోజెన్ సినిమాలు చేస్తుందేమో.. నిజాయితీగా చెప్పాలంటే నా కుమార్తెతో నటించడానికి నాకు భ‌యం అని మ‌హేష్ చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం మ‌హేష్ న‌టిస్తున్న సర్కారు వారి పాట చిత్రం 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా,ఇది పూర్త‌య్యాక త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తన సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నామని మహేష్ బాబు తెలియజేశారు. రాజమౌళి ప్రాజెక్ట్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను అని తెలియ‌జేశాడు.