Divyanka Tripathi | సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం క్యాస్టింగ్ కౌచ్. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు తాము సైతం క్యాస్టింగ్ కౌచ్ బారినపడ్డామంటూ పలువురు దర్శక నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. అవకాశాలు ఇస్తామంటూ పలువురు తమను లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ పలువురు నటీమణులు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా సీరియల్ నటి దివ్యాంక త్రిపాఠి దహియా సైతం క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివ్యాంక త్రిపాఠి ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించింది. కెరియర్ ప్రారంభ సమయంలో ఆఫర్లు లేక చేతిలో చిల్లిగవ్వ లేదని సమయంలో తనకు ఓ ఆఫర్ వచ్చిందని తెలిపింది. ఎంతో సంతోషంతో ఆడిషన్‌కు వెళ్తే డైరెక్టర్‌తో ఒక రోజు రాత్రి గడిపితేనే అవకాశం ఇప్పిస్తానని ఓ వ్యక్తి చెప్పాడని.. ఆ మాటలు విని షాక్ అయ్యాయని పేర్కొంది. అప్పుడే ఇండస్ట్రీలో చాలా మంది అలాంటివారే ఉన్నారనుకున్నానని.. అందుకే ఆ సమయంలో ఆ ఆఫర్‌ని వద్దనుకొని అక్కడి నుంచి వచ్చేసినట్లు తెలిపింది. ఇండస్ట్రీలో అలాంటి వారికి ఎవరూ లొంగిపోకూడదని.. ప్రతిభను నమ్ముకుంటే కచ్చితంగా అవకాశాలు వస్తాయని దివ్యాంక స్పష్టం చేసింది. అవకాశం పేరుతో లైంగిక బెదిరింపులకు పాల్పడే వారిపై ప్రత్యేకంగా చట్టాలు తీసుకవచ్చి, చర్యలు తీసుకోవాలని.. అప్పుడే పరిశ్రమలో మార్పులు వస్తాయని పేర్కొంది.
అంతేకాకుండా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కామన్ అనే వ్యక్తులంతా తగ్గిపోతారని పేర్కొంది. ప్రస్తుతం దివ్యాంక చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. దివ్యాంగ ప్రస్తుతం పలు టీవీ సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్నది. అవకాశం వచ్చిన సందర్భాల్లో సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లలోనూ నటిస్తున్నది. ప్రస్తుతం దివ్యాంక ‘అదృశ్యం’ సీరియల్లో నటిస్తున్నది. సీరియల్ నటుల్లో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటిగా దివ్యాంక త్రిపాఠిక పేరున్నది.