హీరోయిన్ రష్మిక డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేసిన నిందితుడిని గుర్తించిన ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడు ఏపీకి చెందిన వ్యక్తిగా పోలీసులు
విధాత : హీరోయిన్ రష్మిక డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేసిన నిందితుడిని గుర్తించిన ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడు ఏపీకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఢిల్లీ పోలీసులు ఏపీకి వచ్చి అతడిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. బ్రిటీష్ మోడల్‌కు రష్మీక ఫేస్ అతికించి డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేశాడని గుర్తించారు. రష్మిక డీప్ ఫేక్ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనను సినీ ఇండస్ట్రీతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. ఆ తర్వాతా మరికొందరి సెలబ్రీటీల డీప్ ఫేక్‌లు కూడా వెలుగుచూశాయి. దీంతో డీప్ ఫేక్‌ల కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సైబర్ క్రైమ్ విభాగాలు గట్టి చర్యలు చేపట్టాయి. ఈ నేపధ్యంలో రష్మిక డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసిన నిందితుడిని అరెస్టు చేయగలిగారు.