Akira Nandan|పవన్ కళ్యాణ్ ముందు డ్యాన్స్ చేసి అదరహో అనిపించిన అకీరా.. వీడియో వైరల్
Akira Nandan| ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024లో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించి ఒక్కసారిగా హాట్ టాపిక్ కావడం మనం చూశాం. అంతేకాదు తన పార్టీ తరపున పోటీ చేసిన అందరిని గెలిపించిన పవన్ ఇక ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడేందుకు శాయశక్తులా కృషి చేశాడు. పవన్ గెలుపుతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఎంతగానో సంతోషించారు. ఇక పవన్ గెలుపు తర్వాత ఆయన తనయుడు అకీరా నందన్ పవన్ వెంట ఎక్కు

Akira Nandan| ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024లో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించి ఒక్కసారిగా హాట్ టాపిక్ కావడం మనం చూశాం. అంతేకాదు తన పార్టీ తరపున పోటీ చేసిన అందరిని గెలిపించిన పవన్ ఇక ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడేందుకు శాయశక్తులా కృషి చేశాడు. పవన్ గెలుపుతో ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఎంతగానో సంతోషించారు. ఇక పవన్ గెలుపు తర్వాత ఆయన తనయుడు అకీరా నందన్ పవన్ వెంట ఎక్కువగా కనిపించారు. చంద్రబాబుని కలిసిన సమయంలో, మోదీని కలిసిన సమయంలో పవన్ వెంట అకీరా ఉన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సమయంలో తన చెల్లి ఆద్యతో కనిపించాడు అకీరా. అయితే తాజాగా అకీరా డ్యాన్స్‌కి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
పవన్ కళ్యాణ్ ప్రముఖ నటి రేణూ దేశాయ్‌తో కొన్నేళ్లపాటు సహజీవనం చేయగా, ఆ సమయంలో అకీరా జన్మించిన విషయం మనకు తెలిసిందే. అకీరా జన్మించిన తర్వాత పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ వివాహం చేసుకున్నారు.ఇక వివాహం అనంతరం ఈ దంపతులకి ఆద్య జన్మించారు అయితే అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్.విడిపోయారు. ఇక రేణూ తన ఇద్దరి పిల్లలని పూణేకి తీసుకెళ్లి అక్కడే ఉంటూ వారి ఆలనా పాలనా చూసుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రేణూ పిల్లలకి సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా అకీరా డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అ అప్పట్లో పవన్ కళ్యాణ్ హీరోగా సత్యాగ్రహి’ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. పవన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ మూవీ పలు అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. అయితే ఈ మూవీ లాంఛింగ్ టైం లో అకిరా బంగారం మూవీ టైటిల్ సాంగ్ కి డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోలో అకిరా డ్యాన్స్ చేస్తుంటే పవన్, రేణు దేశాయ్ ఇద్దరూ కూడా కొడుకు డ్యాన్స్ చూసి తెగ మురిసిపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీన్ని చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ ఈ వీడియోని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
Akiranandan dancing at the Satyagrahi movie launch❤️🥹.
👑 @PawanKalyan pic.twitter.com/GZMgJGqbBN
— Vinayak Kumar (@VinayakJSP_) August 18, 2024