Akira Nandan| పవన్ కళ్యాణ్ జర్నీపై అకీరా స్పెషల్ వీడియో.. షేర్ చేసిన రేణూ దేశాయ్
Akira Nandan| ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. గత ఎన్నికలలో రెండు చోట్ల ఓడిన పవన్ ఈ సారి మాత్రం దాదాపు 70 వేల పైచిలుకు మెజార్టీతో గెలిచారు. కూటమి కూడా బంపర్ మెజారిటీతో విజయం సాధించింది. అయితే కూటమి ఏర్పడటానికి, దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి విశేష కృషి చేసిన పవన్ కళ్యాణ్‌పై ఫ్యాన్స్, ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపి

Akira Nandan| ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. గత ఎన్నికలలో రెండు చోట్ల ఓడిన పవన్ ఈ సారి మాత్రం దాదాపు 70 వేల పైచిలుకు మెజార్టీతో గెలిచారు. కూటమి కూడా బంపర్ మెజారిటీతో విజయం సాధించింది. అయితే కూటమి ఏర్పడటానికి, దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి విశేష కృషి చేసిన పవన్ కళ్యాణ్‌పై ఫ్యాన్స్, ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. 4వ తేది నుండి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పేరు తెగ మారుమ్రోగిపోతుంది. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు ఇలా పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇక పవన్ కళ్యాన్ గెలవడంతో అకీరా కూడా తన తండ్రి దగ్గరకి వెళ్లి సంతోషాన్ని పంచుకున్నాడు. అభిమానులకి అభివాదం చేస్తూ జోష్ నింపాడు. ఇక పవన్ కళ్యాణ్‌తో గన్నవరంకి కూడా వెళ్లాడు. చంద్రబాబు నాయుడిని కలిసి ఆయన కాళ్లకి నమస్కారం చేశాడు అకీరా. అయితే సోషల్ మీడియాలో తన తండ్రికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అకీరా పెట్టిన పోస్ట్‌లు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ‘సెల్యూట్ ది కెప్టెన్’ అంటూ పవన్ కళ్యాణ్ ఫొటోను షేర్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టాడు అకీరా. దానిని రేణూ దేశాయ్ తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేస్తూ… “తన నాన్నపై అకీరా పోస్ట్” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఇందులో అకీరా ఇన్‌స్టా ఐడీ కనిపించకుండా పేరును బ్లర్ చేసింది రేణూ.
ఇక తాజాగా పవన్ కల్యాణ్ మూవీ జర్నీపై ఆయన కుమారుడు అకిరా నందన్ ఒక స్పెషల్ వీడియోను ఎడిట్ చేశాడు. తండ్రి కోసం తనయుడు స్వయంగా ఎడిట్ చేసిన వీడియోను రేణు దేశాయ్ తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేసింది. కొన్ని రోజుల క్రితమే అకిరా వాళ్ల నాన్న జర్నీ గురించి ఒక వీడియో ఎడిట్ చేశాడని, నాన్న జర్నీ వీడియోను అకిరా షేర్ చేయమని తనకు చెప్పాడని రేణు దేశాయ్ తెలిపారు. అకిరా ఆనందం కోసం ఇది షేర్ చేశాను. ‘‘నా లిటిల్ బాయ్‌కు వాళ్ల నాన్న అంటే అమితమైన ప్రేమ, తండ్రి జర్నీపై తనయుడి గర్వానికి ఇది నిదర్శనం’’ అని ఆమె క్యాప్షన్ పెట్టారు. వీడియోలో ఖుషి నుంచి మొన్నటి భీమ్లా నాయక్ వరకు పవన్ డైలాగ్స్, మరెన్నో సన్నివేశాలు ఉన్నాయి. అన్నింటిని బాగా ఎడిట్ చేసి గూస్‌బంప్స్ తెప్పించాడు. అకీరా టాలెంట్‌కి అభిమానులు ఫిదా అవుతున్నారు
View this post on Instagram
Salute the Captain- #AkiraNandan via Insta Story.🥹♥️ pic.twitter.com/WbPEaAdXXY
— KARNATAKA PawanKalyan FC™ (@KarnatakaPSPKFC) June 4, 2024