Akira Nandan| టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్‌గా మంచి పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్- రేణూ దేశాయ్ ఊహించని కారణాలతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి వైవాహిక జీవితంలో అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. ప్రస్తుతం వారి ఆలనా పాలనా చూసుకుంటూ జీవితం
Akira Nandan| టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్‌గా మంచి పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్- రేణూ దేశాయ్ ఊహించని కారణాలతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి వైవాహిక జీవితంలో అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. ప్రస్తుతం వారి ఆలనా పాలనా చూసుకుంటూ జీవితం గడుపుతుంది రేణూ దేశాయ్. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రేణూ అప్పుడప్పుడు పిల్లలకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అకీరా నందన్‌కి సంబంధించిన వీడియో షేర్ చేయగా, అది నెట్టింట వైరల్ అవుతుంది. అకీరా నందన్ స్టిక్ ఫైట్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించగా, ఆ సన్నివేశాన్ని చిత్రీకరించి తన సోషల్ మీడియాలో షేర్ చేసింద రేణూ.
ఆ వీడియోకి మై సమురాయ్ బేబీ అంటూ క్యాప్షన్‌ను జోడించింది. ఈ ఇన్‌స్టా పోస్ట్‌కు నెటిజన్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో అకీరా తండ్రికి తగ్గ తనయుడి మాదిరిగా కనిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ఎంత అద్భుతంగా చేస్తాడో మనకు తెలుసు. ఇప్పుడు అకీరా కూడా అందులో ప్రావీణ్యం సంపాదించుకుంటున్నాడు. అయితే తాజా వీడియోలో అకీరాని చూస్తుంటే ఖుషీ మూవీలోని ఓ సీన్లో పవన్‌ని చూసినట్టే ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఖుషీ రీమేక్‌తోనే కీరా నందన్ వెండితెర అరంగేట్రం చేస్తారంటూ కొందరు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. అయితే అకీరా నందన్‌కి హీరోగా మారాలనే ఆసక్తి లేదని రేణు దేశాయ్ ఓ సందర్బంలో వెల్లడించిన విషయం తెలిసందే.
ఒకవేళ అకీరా హీరో కావాలని అనుకుంటే ఆ వార్తని వెల్లడించే మొదటి వ్యక్తి తానేనంటూ కూడా రేణు దేశాయ్ ఓ సందర్భంలో పేర్కొంది. అకీరా ఇప్పటి లుక్ పవన్ కళ్యాణ్ యంగ్ ఏజ్‌లో ఎలా ఉన్నాడో అలానే ఉంది. అకీరా ఎక్కడ కనిపించిన కూడా వెంటనే అతనిని కెమెరాలలో బంధించేందుకు పోటీ పడుతున్నారు ఫొటోగ్రాఫర్స్. ప్రస్తుతం చదువుతో పాటు ఇతర యాక్టివిటీస్‌పై ప్రత్యేకమైన దృష్టి పెట్టిన అకీరా ఎప్పుడు ఇండస్ట్రీకి వస్తాడా అనేది చూడాలి.