విధాత : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా రాబోతున్నతాజా వెబ్ సిరీస్ ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం ముంబైలో ప్రీమియర్‌ను ప్రదర్శించారు మేకర్స్. ఈ ప్రీమియర్‌కు బాలీవుడ్ తారలు షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, అలియా భట్, అజయ్ దేవ్‌గన్ తో పాటు అపర కుబేరుడు ముఖేష్ దంపతులు, తదితర రాజకీయ ప్రముఖులు వచ్చి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
ఇందులో ప్రధానంగా రణబీర్, ఆలియా దంపతుల ఫోటోలకు నెటిజన్లు ఫిదా అయ్యారు. రణబీర్ తెల్లటి కోటు ధరించగా, హస్కీ మమ్మీ ఆలీయా అద్భుతమైన తెల్లటి వన్-పీస్ గౌన్ సూట్ .. బంగారు బకిల్‌తో కూడిన సొగసైన బెల్ట్ ధరించింది. ఇద్దరూ కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. సోషల్ మీడియాలో ఆలియా ఫోటోలను చూసిన వారు తల్లి అయినా కూడా తరగని అందంతో మెరిసిపోతున్న ఆమెను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. అందులో దీపిక పదుకుణే అద్భుతం అంటూ ఆలియా ఫోటోకు కితాబినివ్వడం వైరల్ గా మారింది. రణబీర్, ఆలియాలు సంజయ్ లీలా భన్సాలీ ‘లవ్ అండ్ వార్’లో నటించనున్నారు. రణబీర్ బాలీవుడ్ రామాయణ్ లోనూ నటిస్తున్నారు.