Bhagyashri Borse | టాలీవుడ్ లో భాగ్యశ్రీ బోర్సే మాయ!
టాలీవుడ్ లో భాగ్యశ్రీ బోర్సే క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. రవితేజతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముంబయి బ్యూటీ.. ఇప్పుడు విజయ్ దేవరకొండ, దుల్కర్, రామ్ వంటి స్టార్ హీరోలతో జతకట్టి సినిమాల వరసతో యువత మనసు దోచేస్తోంది.

Bhagyashri Borse | విధాత : టాలీవుడ్ లో ప్రస్తుతం నూతన తార భాగ్యశ్రీ బోర్సే మానియా కొనసాగుతుంది. మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజతో జతకట్టి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే క్రమంగా తెలుగు ప్రేక్షాభిమానంతో ముఖ్యంగా కుర్రకారు కలల రాకుమారిగా మారి నంబర్ రేసులో దూసుకుపోతుంది. కైపు కళ్లు..చూపుతిప్పుకోనివ్వని సొగసు..సమ్మోహన పరిచే నవ్వుతో యువత హృదయాలలో గిలిగింతలు రేపడంలో రష్మిక..శ్రీలీల, జాన్వీకపూర్ కంటే ముందువరుసలో ఉంది ఈ మరాఠి భామ. ఓవర్ నైట్ గ్లామరస్ బ్యూటీగా మారిపోయిన భాగ్యశ్రీ బోర్సే సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ముందుగా ఈ భామ విజయ్ దేవరకొండతో నటించిన కింగ్ డమ్ ఈ నెల 31న విడుదల కాబోతుంది. ఈ సినిమా హిట్ అయితే అమ్మడి క్రేజ్ మరింత పెరుగనుంది. సినిమా రిలీజ్ ఈవెంట్ లో భాగ్యశ్రీ నీలిరంగు డ్రెస్ లో ఆకట్టుకుంది. ఈ చిత్ర నిర్మాత నాగవంశీ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో తనకు ‘భాగ్యశ్రీ బాగా నచ్చిందని..అందుకే దర్శకుడు తిన్ననూరి గౌతమ్, హీరో విజయ్ లు అడగకముందే నేను కావాలని ఆమెను హీరోయిన్‌గా పెట్టుకున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇక భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న మరో చిత్రం కాంత. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఆప్డేట్ లో భాగంగా ఆ మధ్య చిత్ర యూనిట్ రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ‘‘ఒక స్టార్ (తార) పుట్టింది…. కుమారి’’ అంటూ భాగ్యశ్రీ బోర్సే కొత్త లుక్‌ని విడుదల చేసింది. ఇలా వారంతా అమ్మడిని పైకెత్తేస్తూ ఆమె క్రేజ్ ను మరింత పెంచేస్తున్నారు. ఇక హీరో రామ్ పోతినేనితో కలిసి నటిస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’సినిమాలో భాగ్యశ్రీ బోర్సే తన నటన, అందంతో ప్రేక్షకులను కవ్వించనుంది. ఈ సినిమా హీరో రామ్ ఏకంగా భాగ్యశ్రీ బోర్సేతో ప్రేమలో పడ్డాడని..ఈ నేపథ్యంలో ఆమెను ఊహించుకుంటూ సినిమాలో ఓ పాట కూడా రాశాడన్న గ్యాసిప్స్ వైరల్ అయ్యాయి.