BIGBOSS:తారాజువ్వల వెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగ్
విధాత:తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్ నాలుగో సీజన్ ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. కింగ్ నాగార్జున వరసగా రెండో సారి వ్యాఖ్యాతగా ప్రారంభమైన ఈ రియాలిటీ షో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతులు ఇచ్చేందుకు సిద్ధమైంది. కరోనా కాలంలో వస్తాడో రాడో అనుకున్న సమయంలో ‘చెప్పండి బోర్‌డమ్‌కి గుడ్‌బై’ అంటూ స్మాల్ స్క్రీన్‌పైకి వచ్చేశాడు బిగ్‌బాస్. స్టార్ మాలో సాయంత్రం 6 గంటలకు మొదలైన ఈ షోలో తారాజువ్వల వెలుగులో గ్రాండీయర్‌గా ఎంట్రీ ఇచ్చాడు […]

విధాత:తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్ నాలుగో సీజన్ ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. కింగ్ నాగార్జున వరసగా రెండో సారి వ్యాఖ్యాతగా ప్రారంభమైన ఈ రియాలిటీ షో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతులు ఇచ్చేందుకు సిద్ధమైంది. కరోనా కాలంలో వస్తాడో రాడో అనుకున్న సమయంలో ‘చెప్పండి బోర్‌డమ్‌కి గుడ్‌బై’ అంటూ స్మాల్ స్క్రీన్‌పైకి వచ్చేశాడు బిగ్‌బాస్.
స్టార్ మాలో సాయంత్రం 6 గంటలకు మొదలైన ఈ షోలో తారాజువ్వల వెలుగులో గ్రాండీయర్‌గా ఎంట్రీ ఇచ్చాడు హోస్ట్ నాగార్జున. బోర్‌డమ్‌ను కిల్ చేస్తూ స్టేజీమీదకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగ్ మిస్టర్ మజ్ను పాటకు స్టెప్పులేశాడు. ఈసారి ప్రేక్షకులకు ఐదు రెట్ల ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తానంటున్నాడు.