Bigg Boss Telugu | బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌..! కంటెస్టెంట్‌ వీళ్లేనటా..?

Bigg Boss Telugu | తెలుగు రియాలిటీ షో బిగ్‌ బాస్‌కు భారీగానే అభిమానులున్నారు. ఇప్పటికే విజయవంతంగా ఏడు సీజన్లను పూర్తి చేసుకొని.. 8వ సీజన్‌కు సిద్ధమవుతున్నది. అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని కొత్త సీజన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. 8వ సీజన్‌కు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. సెప్టెంబర్‌ 8 నుంచి బిగ్‌ బాస్‌ 8 సీజన్‌ ప్రారంభంకానున్నట్లు తెలుస్తున్నది.

Bigg Boss Telugu | బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌..! కంటెస్టెంట్‌ వీళ్లేనటా..?

Bigg Boss Telugu | తెలుగు రియాలిటీ షో బిగ్‌ బాస్‌కు భారీగానే అభిమానులున్నారు. ఇప్పటికే విజయవంతంగా ఏడు సీజన్లను పూర్తి చేసుకొని.. 8వ సీజన్‌కు సిద్ధమవుతున్నది. అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని కొత్త సీజన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా హోస్ట్‌తో పాటు కంటెస్టెంట్స్‌పై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురి పేర్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌కు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. సెప్టెంబర్‌ 8 నుంచి బిగ్‌ బాస్‌ 8 సీజన్‌ ప్రారంభంకానున్నట్లు తెలుస్తున్నది. షో ఎన్ని రోజులు కొనసాగుతుంది? అనేది తెలియరాలేదు.

ప్రస్తుతం కంటెస్టెంట్స్‌ పేర్లు వైరల్‌ అవుతున్నాయి. ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో యాంకర్‌ రీతూ చౌదరీ, ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి.. లేదంటే ఆమె కూతురు సుప్రీత పేర్లు వినిపిస్తున్నాయి. కిరాక్‌ ఆర్‌పీ, కుమారీ ఆంటీ, జబర్దస్త్‌ కమెడియన్‌ బుల్లెట్‌ భాస్కర్, సోషల్‌ మీడియా ఫేమ్‌ బర్రెలక్క, చమ్మక్‌ చంద్ర, నటి కుషిత కల్లపు, అమృత ప్రణయ్‌ బీబీ హౌస్‌కు వెళ్లబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్నది. వాస్తవానికి పర్సనల్‌ లైఫ్‌లో లేదంటే.. ప్రొఫెషనల్‌ లైఫ్‌లో కాంట్రవర్సీలు ఉన్న వారినే నిర్వాహకులు బీబీ హౌస్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ప్రస్తుతం వీరందరి పేర్లను కన్ఫర్మ్‌ చేశారని టాక్‌ నడుస్తుండగా.. మరికొందరి పేర్లు సైతం వైరల్‌ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా.. బిగ్‌ బాస్‌ కొత్త సీజన్‌కు ముందు కొత్త హోస్ట్‌ వస్తారని ప్రచారం జరుగుతూ ఉంటుంది. మూడోసీజన్‌ నుంచి ఏడో సీజన్‌ వరకు టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున బిగ్‌ బాస్‌ షోను హోస్ట్‌ చేస్తూ వస్తున్నారు. తొలి సీజన్‌ను జూనియర్‌ ఎన్టీఆర్‌, రెండో సీజన్‌ను న్యాచురల్‌ స్టార్‌ నానీ హోస్ట్‌ చేశారు. ఈ సారి సైతం నాగార్జునను మార్చనున్నారని ప్రచారం జరిగింది. అయితే, ఇందులో ఏమాత్రం నిజం తేలదని తెలిపోయింది. హోస్ట్‌గా నాగార్జున కొనసాగుతారని.. ఆయనను వదలుకునేందుకు బిగ్‌ బాస్‌ మేనేజ్‌మెంట్‌ ఇష్టపడడం లేదు. ఇప్పటికే 8వ సీజన్‌ను హోస్ట్‌ చేసేందుకు ఒప్పందం సైతం చేసుకున్నట్లు సమాచారం. కొత్త సీజన్‌ కోసం రెమ్యునరేషన్‌ సైతం ఫైనల్‌ చేసినట్లు ప్రచారం జరుగుతున్నది.