Bigg Boss Telugu | బిగ్‌ బాస్‌ – 8 కంటెస్టెంట్‌గా వేణు స్వామి..! ఇదెక్కడి మాస్‌రా మావా..!

Bigg Boss Telugu | తెలుగు అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌ బాస్‌. ఇప్పటి వరకు 7 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొని.. 8వ సీజన్‌కు రెడీ అవుతున్నది. ఈ రియాలిటీ షోకు భారీగానే అభిమానులు ఉన్నారు. త్వరలోనే నయా సీజన్‌ ప్రారంభం కానుండగా.. ఇప్పటికే కంటెస్టెంట్లుగా వెళ్లబోయేది వీరేనంటూ పేర్లు బయటకు వస్తున్నాయి.

Bigg Boss Telugu | బిగ్‌ బాస్‌ – 8 కంటెస్టెంట్‌గా వేణు స్వామి..! ఇదెక్కడి మాస్‌రా మావా..!

Bigg Boss Telugu | తెలుగు అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌ బాస్‌. ఇప్పటి వరకు 7 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొని.. 8వ సీజన్‌కు రెడీ అవుతున్నది. ఈ రియాలిటీ షోకు భారీగానే అభిమానులు ఉన్నారు. త్వరలోనే నయా సీజన్‌ ప్రారంభం కానుండగా.. ఇప్పటికే కంటెస్టెంట్లుగా వెళ్లబోయేది వీరేనంటూ పేర్లు బయటకు వస్తున్నాయి. తాజాగా మరో పేరు గట్టిగానే వినిపిస్తున్నది. అది ఎవరో కాదు తెలుగులో రాష్ట్రాల్లో బాగా ఫేమస్‌ అయిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. ఆయనను సైతం బీబీ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తున్నది. సినీ హీరోయిన్లతో పూజలు, హీరో హీరోయిన్లు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు వేణు స్వామి.

ఆయన సైతం బిగ్‌ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్త వైరల్‌గా మారింది. ఇందులో ఎంత వరకు నిజం అన్నది తెలియరాలేదు. అయితే, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ సెలబ్రిటీగా మారారు. ఏ అంశంలోనైనా తన మనసులో మాటను దాచుకోకుండా మాట్లాడుతూ వస్తుంటారు. బిగ్‌ బాస్‌ టీం సైతం కావాల్సింది ఇదే కదా.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే కంటెస్టెంట్లతో మంచి కంటెంట్‌ వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. దాంతో వేణు స్వామిని బీబీ హౌస్‌లోకి రప్పించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం వేణు స్వామి పూజలు చేస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు.

వంద రోజుల పాటు ఆయన బీబీ హౌస్‌లో ఉండాలనుకుంటే భారీగానే రెమ్యునరేషన్‌ ముట్టచెప్పాల్సి ఉంటుంది. బీబీ హౌస్‌లోకి వస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌ వేణు స్వామికి అత్యధికంగా రెమ్యునరేషన్‌ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతున్నది. వేణు స్వామితో పాటు బీబీ హౌస్‌లోకి వెళ్లబోయే జాబితాలో పలువురు సెలబ్రిటీలతో పాటు యూట్యూబర్స్‌, ఇన్‌ఫ్లూయెన్సర్ల పేర్లు సైతం వినిపిస్తున్నాయి. కుమారీ ఆంటీ, బర్రెలక్క, అమృత ప్రణయ్, యూట్యూబర్ నేత్ర, మోటీవేషనల్ స్పీకర్ వంశీతో పాటు మరికొందరు టీవీ సీరియల్‌ యాక్టర్స్‌ కంటెస్టెంట్స్‌గా బీబీ హౌస్‌లోకి వెళ్తారనే ప్రచారం జరుగుతున్నది. ఇక బిగ్‌బాస్‌ ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రారంభించేందుకు మేకర్స్‌ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.